Omicron Sub Variant : దేశరాజధానిలో ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియెంట్.. ఫోర్త్ వేవ్ వస్తుందా?
NQ Staff - August 11, 2022 / 06:23 PM IST

Omicron Sub Variant : కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్ని ఎంతలా వణికిపోయాయో మనం చూశాం. ఈ మహమ్మారి వలన చాలా మంది ప్రముఖులు సైతం కన్నుమూశారు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలని ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియెంట్ వణికిస్తుంది. దేశ రాజధానిలో ఈ వేరియెంట్ అలజడి సృష్టిస్తోంది.
సబ్ వేరియెంట్..
ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి వచ్చిన శాంపిల్స్‌లో ఈ సబ్‌వేరియెంట్ నమునాలు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ 2.75.. చాలా శాంపిల్స్‌లో గుర్తించినట్లు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు.. పాజిటివిటీ రేటు పెరిగిపోతున్న వేళ.. ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్యా పెరుగుతోందని డాక్టర్ సురేష్ వెల్లడించారు.

The Omicron Sub Variant is Expanding Rapidly
ఇన్‌ఫెక్షన్ ద్వారా సంక్రమించిన ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్‌ను లెక్కచేయకుండా ఈ ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోందని వైద్యులు వెల్లడించారు. యాంటీ బాడీలు ఉన్నవాళ్లతో పాటు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవాళ్లపైనా ఇది ప్రభావితం చూపిస్తోందని వైద్యులు తెలిపారు.
దీని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ , వయసుపైబడిన వాళ్లపై ఇది తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేలకు పైనే కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేంద్రం.. అప్రమత్తం అయ్యింది.