దేశ భవిష్యత్ కోసమే కొత్త విద్యావిధానం

Advertisement

దేశంలో కొత్త విద్యా విధానాన్ని చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అయితే పిల్లలకు సిలబస్ పేరుతో భారీ పుస్తకాలు అవసరం లేదని అలాగే పిల్లల మేధస్సును పెంచే సిలబస్ ఉండాలని ప్రధాని మోడి వెల్లడించాడు. కొత్త విద్యావిధానంపై మోడీ మాట్లాడుతూ.. 30 ఏళ్ళ తరువాత కొత్త విద్యా విధానం వస్తుందని అన్నాడు. అలాగే ఒకటే దేశం.. ఒకటే విద్యా విధానం ఉండాలని స్పష్టం చేశారు. కొత్త విద్యావిధానంలో సంచలన మార్పులు తీసుకొచ్చామని తెలిపాడు.

అలాగే అన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఇష్టమైన కోర్సు చదువుకునే విధంగా మార్పులు చేశామని కొనియాడారు. ఈ విద్యా విధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్పులు తీసుకువచ్చామని, ఈ మార్పులు దేశ భవిష్యత్ కు‌ అవసరమని అన్నారు. నూతన విద్యా విధానంపై ఎవరు కూడా ఆందోళన చెందవద్దని పేర్కొన్నాడు. అలాగే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ కొత్త విద్యావిధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోడీ సూచించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here