Indian Army : ఇండియన్ ఆర్మీకి పెళ్లి పిలుపు… వచ్చిన రెస్పాన్స్ కు కొత్త జంట ఫిదా
NQ Staff - November 21, 2022 / 06:42 PM IST

Indian Army : కేరళ కు చెందిన రాహుల్ మరియు కార్తీకల వివాహం ఈనెల 10వ తారీఖున జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి రాహుల్ మరియు కార్తీక్ లు బందు మిత్రులను మాత్రమే కాకుండా ఇండియన్ ఆర్మీ ని ఆహ్వానించారు.
డియర్ హీరోస్ అంటూ ఒక ప్రత్యేకమైన లెటర్ ను నూతన దంపతులు రాసి తమ పెళ్లి నవంబర్ పదవ తారీఖున జరగబోతుంది. కావున మీరు తప్పకుండా హాజరు కావాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఆ లెటర్లో ఇండియన్ ఆర్మీ యొక్క గొప్పతనంను పొగుడుతూ కొత్త జంట అందరి దృష్టిని ఆకర్షించారు.
సాధారణంగా సెలబ్రిటీలనే రాజకీయ ప్రముఖులను పెళ్లిళ్లకు ఆహ్వానిస్తారు, కానీ వీరు విభిన్నంగా ఇండియన్ ఆర్మీ ని తమ పెళ్ళికి ఆహ్వానించడంతో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వీరికి ఉన్న దేశ భక్తి మరియు ఇండియన్ ఆర్మీపై ఉన్న గౌరవం అభిమానం నిజంగా గ్రేట్ అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. రాహుల్ మరియు కార్తికల పెళ్లి ఆహ్వానంపై ఇండియన్ ఆర్మీ స్పందించింది.
మా యొక్క హార్దిక శుభాకాంక్షలు మీకు అందజేస్తున్నాం.. ఇండియన్ ఆర్మీ తరపున హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. చాలా సంతోషంగా మీరు మీ జీవితాన్ని గడపండి అంటూ అఫిషియల్ ఇండియన్ ఆర్మీ యొక్క ట్విట్టర్ ఖాతాలో రాహుల్ మరియు కార్తీకలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ శుభాకాంక్షలు ఆ కొత్త జంట ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.