Muslim Cleric: ఆ మ‌హిళ‌లు వేశ్య‌ల‌ని కామెంట్ చేసిన ముస్లిం మతాధికారి.. ఫైర్ అవుతున్న నెటిజ‌న్స్

Muslim Cleric: మ‌హిళ‌ల విష‌యంలో ఇష్టారాజ్యంగా మార‌డం ఈ మ‌ధ్య కామ‌న్‌గా మారింది. సామాన్యులే కాదు మంచి పొజీష‌న్‌లో ఉన్న వ్య‌క్త‌లు సైతం మ‌హిళ‌ల‌పై త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వీరిని చూసి మ‌రో న‌లుగురు అలాంటి కామెంట్సే చేస్తుండ‌డంతో మ‌హిళా సంఘాలు న్యాయం చేయాల‌ని రోడ్డెక్కుతున్నారు. నోరుంది ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా మాట్లాడ‌డం కరెక్ట్ కాదు అని వారు హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేస్తున్నారు.

Muslim Cleric:
Muslim Cleric:

తాజాగా కేరళ ముస్లిం మతాధికారి స్వాలి బతే మ‌హిళ‌ల గురించి సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. రాత్రిపూట 9 దాటిన తర్వాత బయటకు వెళ్లే మహిళలంతా వేశ్యలేనని… వారిని అత్యాచారం, హత్య చేసినా తప్పు కాదంటూ కేరళ ముస్లిం మతాధికారి స్వాలి బతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2011లో జ‌రిగిన అత్యాచారానికి మ‌ద్దతుగా ఆయ‌న ఈ కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

2011లో గోవిందస్వామి అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా గాయపరిచాడు. అత‌నికి కోర్టు మ‌ర‌ణ శిక్ష విధించింది. అయితే సుప్రీంకోర్టు ఉరిశిక్షను 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది. ఈ ఘ‌ట‌నకు సంబంధించి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన స్వాలి బ‌త్రే.. “రాత్రిపూట ప్రయాణించే మహిళలందరూ వేశ్యలే. అత్యాచారానికి గురైన బాలిక కూడా రాత్రి పూట ప్రయాణిస్తోంది కాబట్టే గోవింద స్వామికి చిక్కింది అని కామెంట్ చేశారు.

రాత్రిపూట బ‌య‌ట తిరిగే మ‌హిళ‌ల‌పై అత్యాచారం చేయ‌డం,చంప‌డం త‌ప్పుకాదు అని ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.ఈయ‌న కామెంట్స్‌పై స‌ర్వ‌త్రా నిర‌స‌న‌ల వ్య‌క్తం అవుతున్నాయి. ఇలాంటి వాళ్ల‌ని దారుణంగా శిక్షించాల‌ని అంటున్నారు.

కేరళలో ముస్లిం మతాధికారులలో 27 ఏళ్ల స్వాలి బత్రే ఒకరు కాగా, ఆయ‌న చూడ‌డానికి చాలా చిన్న పిల్లాడిలా క‌నిపిస్తారు. హెచ్‌డీపీ సిండ్రోమ్‌తో బాధపడుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఇలా క‌నిపిస్తున్నారు. గ‌తంలోను ఇలాంటి వివాదాస్ప‌ద కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచాడు.