దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎం లు ఎవరో తెలుసా..

Advertisement

ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే మూడ్ అఫ్ ది నేషన్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంలను గుర్తించాలని ఓ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వే లో అనేక విషయాలు వెల్లడించింది. మొత్తం 19 రాష్ట్రాల్లోని 97 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. అయితే దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్‌ మూడో స్థానంలో నిలిచారు.అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. అయితే జులై లో 12,021 మందిని ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించారు.

ఆ ఇంటర్వ్యూల ద్వారా అభిప్రాయాలను సేకరించి అనేక విషయాలు వెల్లడించారు. అయితే వారు నిర్వహించిన సర్వే లో.. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండవ స్థానంలో నిలిచారు. తరువాత పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నాలుగవ స్థానంలో, ఇతరులు ఐదవ స్థానంలో, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఆరవ స్థానంలో, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఏడవ స్థానంలో, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఎనిమిదవ స్థానంలో, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లట్‌ లు పదవ స్థానంలో నిలిచారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here