YS Vivekananda Reddy : వివేకా కేసు.. లండన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్న జగన్
NQ Staff - April 17, 2023 / 08:34 PM IST

YS Vivekananda Reddy : మాజీ మంత్రి, ముఖ్య మంత్రి జగన్ బాబాయి అయినా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైకాపా నాయకుడు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది.
అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి యొక్క తండ్రి భాస్కర్ రెడ్డి అనే విషయం తెలిసిందే. మరో వైపు ఎంపీ అవినాష్ రెడ్డి ని కూడా సిబిఐ అధికారులు విచారణకు పిలిచారు. దాంతో ఆయన్ని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 21వ తారీఖున లండన్ ప్రయాణించాల్సిన ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో వివేక హత్య కేసు కు సంబంధించిన విచారణ వేగంగా జరుగుతుండటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున సీఎం జగన్ ముందస్తు చూపుతో తన పర్యటనను వాయిదా వేసుకుని ఉండవచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.