Snake Bite Child: వ్యూస్ కోసం పిల్లాడితో పాముని ప‌ట్టించిన తండ్రి.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

Snake Bite Child: సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక చాలా మంది త‌మ టాలెంట్‌ని ఈ మాధ్య‌మాల‌లో పంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారుతున్నారు. కొంద‌రు ఇలా మారేందుకు వికృత చేష్ట‌లు చేస్తూ విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. తాజాగా నెట్టింట్లో వైరలవుతోన్న ఓ వీడియోపై నెటిజనులు ఇలానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్‌ కోసం ఇలా చేస్తావా.. అసలు మనిషివేనా అంటూ మండిప‌డుతున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్‌ వ్రైట్‌ గత 20 సంవత్సరాలుగా మొసళ్ల వేటగాడిగా పని చేస్తున్నాడు. జనారణ్యంలోకి వచ్చిన మొసళ్లను గుర్తించి.. తిరిగి వాటి నివాస స్థలానికి తరలిస్తాడు. తాజాగా ఆయ‌న తన సోష‌ల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. ఇందులో రెండేళ్ల చిన్నారి రెండు చేతులతో ఓ పెద్ద పాము తోకను పట్టుకుని లాగించాడు.

అంద పెద్ద‌పాముని చిన్నారి ప‌ట్టుకోవ‌డం చూస్తే భయంతో ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ వీడియోలో ఉన్న చిన్నారి మ్యాట్‌ కుమారుడు. ‘‘దాన్ని బయటకు లాగు చిన్నా. దాన్ని పొదల్లోకి పంపు’’ అంటూ మ్యాట్‌ అరవడం వినిపిస్తుంది. చిన్నారితో అలాంటి సాహ‌సాలు చేయించ‌డం ఏ మాత్రం మంచి కాద‌ని కొందరు చెబుతున్నారు. ‘ఛీ వ్యూస్‌ కోసం ఇంతకు తెగిస్తావా.. ఆ పిల్లాడు చిన్నవాడు. పాము.. దాని నైజం గురించి వాడికి తెలియదు ,అది కాటేస్తే ప‌రిస్థితి ఏంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.