iPhone : 1.5 లక్షల రూపాయల చిల్లరతో ఐఫోన్ కొనేందుకు వెళ్ళి.! వీడెవడ్రాబాబూ.!
NQ Staff - December 20, 2022 / 08:17 PM IST

iPhone : ఐ ఫోన్ కొనాలంటే మినిమమ్ ఓ 50 వేలయినా వుండాలి. అఫ్కోర్స్.! ఓ పాతిక ముప్పై వేలలోనూ రావచ్చు. అయినా కానీ, ఐ ఫోన్ అంటే అత్యంత ఖరీదైన యవ్వారమే.
భారీగా నోట్ల కట్టలిస్తేనే ఐఫోన్ కొనగలం. కానీ, అదేంటండీ ఈ కుర్రోడు చిల్లర పైసలు తీసుకెళ్లి ఐ ఫోన్ కొనేయాలనుకున్నాడు. విచిత్రంగా వుంది కదా.
చిల్లరకు ఐఫోన్ రాదన్న సెల్‌ఫోన్ యజమాని, వాగ్వాదానికి దిగిన కుర్రోడు.!
అనుకున్నదే తడవుగా యాపిల్ స్టోర్‌కి వెళ్లాడు. ఐఫోన్ 14ని సెలెక్ట్ చేసుకున్నాడు. దుకాణదారుడు బిల్లు చెల్లించమని అడగ్గా తన వద్ద వున్న చిల్లర డబ్బుల సంచిని షాపులో దిమ్మర బోశాడు.
చిల్లరే కదా.. అని తక్కువ చేసి చూడొద్దండోయ్. ఆ చిల్లర మొత్తం ఎంతో తెలుసా.? అక్షరాలా లక్షన్నర. అతను సెలెక్ట్ చేసుకున్న ఐఫోన్ 14 ఖరీదు 84 వేల రూపాయలు. లెక్కపెట్టి ఆ బిల్లు తీసుకుని, మిగిలిన డబ్బుల సంచిలో వేయమని దుకాణదారునికి చెప్పాడు.
దాంతో చిర్రెత్తిన సెల్‌ఫోన్ యజమాని ఆ కుర్రోడితో వాగ్వాదానికి దిగాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఎవరా కుర్రాడు.? పేరు అమిత్. ఓ యూట్యూబర్. తన ఛానెల్లో ఈ వీడియో పోస్ట్ చేసి లక్షల కొద్దీ వ్యూస్ సాధించాడీ అమిత్ శర్మ. అర్ధమైందా అసలు విషయం. ఇదంతా జస్ట్ వైరల్ వీడియో అన్నమాట. తర్వాత ఆన్లైన్లో పైసలు చెల్లించి అమిత్ ఆ ఐఫోన్ కొనుక్కెళ్లాడు. అదీ సంగతి.