Thaman: క‌రోనా నుండి కోలుకుంటున్న సెల‌బ్స్.. గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్

Thaman: ఈ సారి చాలా మంది సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు తాము క‌రోనా బారిన ప‌డిన విష‌యాన్ని తెలియ‌జేస్తూ అభిమానుల‌ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్ మరియు కోలీవుడ్ కి చెందిన ప్రముఖులే ఒకరి తర్వాత ఒకరు గురి కావడం కాస్త ఆందోళనగా మారింది.

thaman gets corona positive1
thaman gets corona positive1

అయితే ఈ సంఖ్య మరింత స్థాయిలో పెరగడం మరింత కలవర పెట్టగా వారిలో మన టాలీవుడ్ కి చెందిన స్టార్ మ్యూజిక్ కంపోజర్ అందులోని ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కి పాజిటివ్ రావడం షాక్ ఇచ్చింది. మరి దీనితో అనేక సినిమాల వర్క్స్ ఆగిపోయాయి.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను కరోనా నుంచి కోలుకున్నట్టు తమన్ ప్రకటించాడు. హ‌లో ఆల్.. కరోనా నెగెటివ్ వచ్చింది.. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ఇలాంటి కష్టకాలంలో నాకు కోసం ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అందరికీ రుణ పడి ఉంటాను. నా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎప్పుడూ నన్ను భద్రంగా చూసుకున్న వైద్యులకు థ్యాంక్స్. నన్ను బేబీలా చేసుకున్న నా టీంకు నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను.

thaman gets corona positive2
thaman gets corona positive2

కరోనా నిబంధనలను పాటించండి. అందరూ వ్యాక్సిన్ వేసుకోండి. అందరూ మాస్కులు ధరించండి. మీ ప్రేమ, సపోర్ట్‌కు నేను ఎప్పుడూ కృతజ్ఞుడినే అంటూ తమన్ చెప్పుకొచ్చాడు. అయితే సత్యరాజ్ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారంటూ సత్యరాజ్ కొడుకు సిబి సత్యరాజ్ తెలిపాడు. ఇక తమన్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు.

దీంతో సినీ ప్రియులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే సినీ ప్రముఖులకు కరోనా సోకుతుండటంతో షూటింగ్‌లన్నీ కూడా వాయిదా పడుతున్నాయి. నిన్న‌ కీర్తి సురేష్ కూడా కరోనా బారిన పడింది. దీంతో సర్కారు వారి పాట టీంలో హీరో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్,మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కరోనా బారిన పడ్డట్టు అయింది.

ఇప్పటికీ మంచు లక్ష్మీ, మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు క్వారంటైన్‌లోనే ఉన్నారు. వీరు కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో కరోనా నుంచి కోలుకుంటారని తెలుస్తోంది.