Veera Simhareddy : ‘జై బాలయ్య’ మోత మోగించేస్తాడంటోన్న తమన్.!

NQ Staff - December 4, 2022 / 01:37 PM IST

Veera Simhareddy : ‘జై బాలయ్య’ మోత మోగించేస్తాడంటోన్న తమన్.!

Veera Simhareddy : నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్. గోపీచంద్ మలినేని దర్శకుడు.

‘వీర సింహా రెడ్డి’ సినిమాకి సంబంధించి మ్యూజిక్ కంపోజిషన్ దాదాపు పూర్తయిపోయింది. ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు షురూ చేశాడు తమన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమన్ వెల్లడించాడు.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దుమ్ము రేపెయ్యాలి..

ఈ మధ్యకాలంలో తమన్ అంటే పాటలు కాదు.. తమన్ అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. చాలా సినిమాలు ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కారణంగా మరో లెవల్‌కి వెళ్ళాయన్నది నిస్సందేహం. పాటల విషయంలో కాపీ ట్యూన్స్ అనే విమర్శల్ని ఎదుర్కొంటున్నట్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ అవే విమర్శల్ని తమన్ ఎదుర్కొంటున్నాడు.

అయినాగానీ, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తే థియేటర్లలో వూఫర్లు బద్దలైపోతాయన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో వుంది. ‘జై బాలయ్యా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్ము రేగిపోద్ది..’ అంటూ అటు బాలయ్య అభిమానులు, ఇటు తమన్.. సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు.

ఇప్పటికే అత్యద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ‘వీర సింహా రెడ్డి’ కోసం డిజైన్ చేసిన తమన్, దానికి మెరుగులు దిద్దే పనిలో బిజీగా వున్నాడట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us