Thad Roberts: చంద్రుడిపై రొమాన్స్ చేయాల‌నుకున్నాడు.. 8 ఏళ్లు క‌ట‌క‌టాల పాల‌య్యాడు..!

Thad Roberts: కొంద‌రు చేసే విచిత్ర ప‌నులు అంద‌రికి ఆశ్చర్యాన్ని క‌లిగిస్తుంటాయి. ఓ మ‌హానుభావుడు ఏకంగా చంద్రుడిపై రొమాన్స్ చేసి వార్త‌ల‌లోకి ఎక్కాడు. దాని వ‌ల‌న ఏకంగా రూ.157 కోట్ల న‌ష్టం వాటిల్లింది. వివ‌రాల‌లోకి వెళితే అమెరికాకు చెందిన థాడ్ రాబర్ట్స్ చంద్ర మండలంపై కాలు మోపి, అక్కడ ప్రయోగాలు చేయాలనే కోరిక ఉండేది. కోరికకు తగ్గట్లు అదృష్టం వరించింది.

Thad Roberts - the NASA intern who stole lunar rocks to 'have sex on the Moon
Thad Roberts – the NASA intern who stole lunar rocks to ‘have sex on the Moon

నాసా లూనార్ ల్యాబ్‌లో వ్యోమగాములుగా శిక్షణ పొందితే ఏదో ఒకరోజు స్పేస్‌లో అడుగపెట్టే అవకాశం లభిస్తుంది. కానీ థాడ్‌లోని సె**కోరికలు ఆ అవకాశాన్ని దూరం చేశాయి. నాసాలో ట్రైనింగ్‌ తీసుకుంటుండగా.. అదే ల్యాబ్‌లో పనిచేసే ప్రియురాలు ‘టిఫనీ ఫౌలర్’తో ఏకంగా చంద్రుడి మీద తన ‘కోరిక’ తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ అందుకు నాసా అంగీకరించదు? మరేం ఏం చేయాలి? అని అనుకున్నాడు. అప్పుడే థాడ్‌లో దుర్భుద్ది పుట్టింది.

నాసా చంద్ర‌మండ‌లం నుండి తెచ్చిన రాళ్లు, దూళిని దొంగిలించి వాటిపై శృంగారం చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తన ప్లాన్‌ను తన ప్రియురాలికి చెప్పడంతో ఆమెకూడా అందుకు అంగీకరించింది. పనిలో పనిగా రాళ్లను, దూళిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు బెల్జియంకు చెందిన సైంటిస్ట్‌తో తనని తాను ఆర్బ్ రాబిన్సన్గా పరిచయం చేసుకున్నాడు.

గ్రాముకు రూ.5 వేల డాలర్లు భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.3.70 లక్షలు చెల్లించేందుకు ఆ శాస్త్రవేత్త అంగీకరించాడు. అయితే వాటిని దొంగిలించేందుకు తన స్నేహితులు సాయం తీసుకున్నాడు. అనుకున్న ప్రకారం సేఫ్టీ లాకర్‌ను బద్దలు కొట్టి అందులో ఉన్న రాళ్లను, దూళిని దొంగిలించాడు. చివరికి ‘సె** ఆన్ ది మూన్’ పేరుతో ఓ హోటల్‌లో తన ప్రియురాలితో కోరిక తీర్చుకున్నాడు. అనంతరం రాళ్లు, దూళి బరువు ఎక్కువగా ఉంటే డబ్బు ఎక్కువగా వస్తుందని.. వాటిని కల్తీ చేశాడు.

స్టైంటిస్ట్‌కు అమ్మే ప్ర‌య‌త్నం చేయ‌గా, థాడ్‌ రాబర్ట్స్ చేసిన దొంగతనం గురించి సమాచారం అందుకున్న ఫెడర్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. థాడ్‌ రాబర్ట్స్‌ చేసిన చెత్త పనివల్ల నాసా రూ.157 కోట్లు విలువ చేసే చంద్రుడి దూళిని కోల్పోయింది. ఈ దొంగతనం వ‌ల‌న కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది.