జానపద గాయకుడు వంగపండు మృతికి సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Advertisement

జానపద గాయకుడు వంగపండు వరప్రసాద్ రావు ఇవ్వాళ ఉదయం గుండెపోటుతో విజయనగరం పార్వతీ పురంలోని పెద్దబొందపల్లిలో ఆయన మృతి చెందారు. వంగపండు ప్రసాదరావు మరణం తనను ఎంతో కలిచి వేసిందని, ఆయన తనకు ఆప్తులని ఏపీ సీఎం జగన్ తెలిపారు. జానపదాన్ని ఆయుధంగా మార్చుకొని, ఉత్తరాంధ్ర ప్రజల గొంతుగా మారారని వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్య రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారని ట్వీట్ చేశారు.

అలాగే తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేసారు. ప్రజల బాధలు-సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here