ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల సంతాపం తెలిపిన ఏపీ, తెలంగాణ సీఎంలు

Advertisement

భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రణబ్ మరణం దేశానికి తీరని లోటు అని కొనియాడారు. తెలంగాణ అంశంతో ప్రణబ్ ముఖర్జీకి ఎంతో అనుబంధం ఉందన్నారు. యాదాద్రి ఆలయ పనులను పరిశీలించి అభినందించారని అన్నాడు. అలాగే ప్రణబ్ తెలంగాణ పర్యటనను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకొని పలు విషయాలు తెలిపాడు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు.

ప్రణబ్‌ ముఖర్జీ (84) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ ‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని కొనియాడారు. అలాగే రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్‌ దేశానికి ఎంతో సేవలు చేశారని సీఎం జగన్ ప్రశంసించారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here