Karimnagar Earthquake: క‌రీంన‌గ‌ర్‌లో భూకంపం.. వ‌ణికిపోయిన ప్ర‌జ‌లు

Karimnagar Earthquake శ‌నివారం తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల‌లో భూప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. శ‌నివారం మ‌ధ్యాహ్నం 2:03 నిమిషాల‌కు స్వ‌ల్పంగా భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 4గా న‌మోదైంది. క‌రీంన‌గ‌ర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మైంది. ఈ ప్ర‌భావం స‌మీప జిల్లాల‌పై ప‌డింది.

రామగుండానికి పశ్చిమ నైరుతి దిశగా 8 కి.మీ దూరంలో.. కరీంనగర్ పట్టణానికి ఈశాన్య దిశగా 45 కి.మీ దూరంలో.. భూమికి 20 కి.మీ. లోతున.. భూకంప కంద్రం ఉన్నట్లు పేర్కొంది. దాదాపు 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం వణికిపోయారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మంచిర్యాల, రాంనగర్, నస్పూర్‌, గోసేవ మండల్ కాలనీలో భూమి కంపించింది. భూమి కదలికలు గుర్తించిన జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పెరుగెత్తారు.

దాదాపు రెండు సెకండ్లపాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీశ్రీనగర్, చున్నంబట్టివాడ, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్ గ్రామాల్లో భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐతే భూకంప తీవ్రత 4 మాత్రమే ఉందని.. అంటే చాలా తక్కువ తీవ్రత కలిగిన భూకంపమని అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.