తెలంగాణ రాష్ట్రం మొత్తం కరోనా పరీక్షలు ముందుకు వైద్యం ఫ్రీ ఫ్రీ సంచలన నిర్ణయం తీసుకున్న కెసిఆర్

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకవైపు కరోనా కట్టడి చేయడంలో విఫలం అయింది అని హై కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మందలించింది. అటు ప్రతిపక్షాలు మరియు సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వం పై అసమ్మతీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటె తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టులు మరియు ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తామని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రవేట్ ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స అందించనున్నాము అని స్పష్టం చేసారు.

అయితే ప్రవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు మరియు ట్రీట్మెంట్ అన్ని కూడా ఉచితంగా అందేలా సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.

ఈ కరోనా ట్రీట్మెంట్ కోసం ముందు మూడు ప్రవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసారు. దాంట్లో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మమతా మెడికల్ కాలేజ్ మరియు కామినేని మెడికల్ కాలేజ్ ఈ మూడు కాలేజీలలో కరోనా టెస్టులు మరియు చికిత్సలు ఉచితంగా అందించనున్నారు.

ఈ మెడికల్ కాలేజీల్లో ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక వైద్యులను మరియు అధికారులను కూడా నియమించనున్నారు.తరువాత ఈ సేవలను మరిన్నిప్రవేట్ మెడికల్ కాలేజీలకు విస్తరించనున్నారు. వీటి గురించి మరింత సమాచారం త్వరలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలుపనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here