Telangana Political News : ఆ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలపై ఒత్తిడి పెంచిన కేసీఆర్
NQ Staff - August 22, 2023 / 04:21 PM IST

Telangana Political News :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉంది. ఇంతలోనే కేసీఆర్ అనూహ్యంగా తమ అభ్యర్థులను ప్రకటించారు. కొన్ని సీట్లలో మినహా అన్ని సీట్లకు సంబంధించిన అభ్యర్థులు ఖరారు అవ్వడంతో వారు అప్పుడే ప్రచారం షురూ చేశారు. మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్ లకు ఛాన్స్ లు ఇవ్వడం జరిగింది. దాంతో కొందరు ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ లో అసమ్మతి తక్కువే ఉన్నా కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తో ఇతర పార్టీ ల్లో అసమ్మతి సెగలు మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ అసమ్మతి హడావుడి మొదలయింది.
కేసీఆర్ తీసుకున్న ముందస్తు అభ్యర్థుల ప్రకటన నిర్ణయంతో కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకుల్లో కూడా ముందస్తు సీట్ల ప్రకటన డిమాండ్ వ్యక్తం అవుతోంది. మొత్తం కాకున్నా కూడా కనీసం సగం స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను అయినా ప్రకటించాలని ఆయా పార్టీల ముఖ్య నాయకులు జాతీయ నాయకత్వం పై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది మంది అభ్యర్థులను ప్రకటించినా కూడా బీఆర్‌ఎస్ కి పోటీ అన్నట్లుగా ఉంటుందని కొందరు రాష్ట్ర నాయకులు జాతీయ నాయకత్వం తో వాదిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్, బీజేపీ నేతల ఢిల్లీ ప్రయాణం…
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీట్ల విషయంలో ముందస్తుగా ఆలోచించడంతో తమ పార్టీల జాతీయ నాయకత్వం కూడా వెంటనే అభ్యర్థులను ఖరారు చేయాలి అంటూ డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి తమ అధినాయకత్వం వద్ద కేసీఆర్ వ్యూహం ను వివరించినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ వ్యూహం పై ఆ రెండు జాతీయ పార్టీల అధినాయకత్వం కూడా అవాక్కయి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ మరియు బీజేపీ లు ఈసారి తెలంగాణ లో అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల తమ విజయం ఖాయం అన్నట్లుగా రెండు పార్టీ లు కూడా బలంగా నమ్ముతున్నాయి. అందుకే కేసీఆర్ మాదిరిగానే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది. మరి బీజేపీ మరియు కాంగ్రెస్ లు ఎన్నికలకు ఇన్ని రోజుల ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందా అనేది చూడాలి. మొత్తానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వం పై రాష్ట్ర నాయకుల ఒత్తిడి తప్పదేమో.