Telangana : అమెరికా అధ్యక్ష భవనం.. తెలంగాణ సచ్చివాలయం సేమ్ టు సేమ్
NQ Staff - January 21, 2023 / 11:06 PM IST

Telangana : కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మించారు. భారీ ఎత్తున ఖర్చు చేసి నిర్మించిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కి ఫిబ్రవరి 17వ తారీఖున ప్రారంభోత్సవం జరగబోతోంది.
95 శాతం పనులు పూర్తయ్యాయని సమాచారం అందుతుంది. రాబోయే వంద సంవత్సరాల అవసరాల దృష్ట్యా తెలంగాణ సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య రెట్టింపు చేసినా కూడా సరి పోయే విధంగా సెక్రటేరియట్ ను నిర్మిస్తున్నారు.
28 ఎకరాల విస్తీర్ణంలో 11 అంతస్తులో ఈ భవనం నిర్మించారు. డెక్కన్, కాకతీయ శైలి నిర్మాణంలో ఈ భవనాన్ని రెండు ప్రధాన గుమటాలుగా, 34 చిన్న గుమ్మటాలుగా విభజించడం జరిగింది. తెలంగాణ సాంప్రదాయంతో పాటు హంగు ఆర్భాటాలు చాలానే ఉన్నాయి.
జనవరి 4, 2021న నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. చాలా తక్కువ సమయంలోనే ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. తెలంగాణ సెక్రటేరియట్ చూడ్డానికి అచ్చు సేమ్ టు సేమ్ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఉన్నట్లే ఉండబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అమెరికా అధ్యక్ష భవనం మరియు తెలంగాణ సెక్రటేరియట్ సేమ్ టు సేమ్ అన్నట్లుగా ఉంటే సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి సెక్రటేరియట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రారంభమైన తర్వాత పూర్తి ఫోటోలు మరియు వీడియోలు బయటికి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అమెరికా అధ్యక్షుడు భవనానికి పోలికలు ఉన్నాయా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.