తెలంగాణ విమోచన దినోత్సవం వెనుక ఉన్న అసలు విషయం ఇదే..

Advertisement

తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లు. అలనాడు 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన, తెలంగాణకు మాత్రం ఆ స్వాతంత్య్రం రాలదు. ఎందుకంటె అప్పటి నిజాం నవాబులు అయిన ఉస్మాన్ అలీఖాన్ తెలంగాణను భారత్ లో విలీనం చేయనని తేల్చి చెప్పాడు. ఇక హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్ లో కలవదని స్వతంత్ర్యంగా ఒంటరిగా ఉంటుందని నిజాం నవాబులు ప్రకటన చేసారు. ఇక నిజాం పెత్తనంలో తెలంగాణ ప్రజలు అణిచివేయబడ్డారు. ఒక వైపు దోపిడీ దొంగలు, కిరాయి హంతకులుగా రజాకార్లు తెలంగాణ ప్రజలపై బానిసలుగా చూసేవారు. ఇక తెలంగాణ ఆడపడుచులను బట్టలూడదీసి బతుకమ్మ ఆట ఆడించి పైశాచిక ఆనందం పొందేవారు. ఆఖరికి పసి పిల్లలను, ముసలివాళ్లను అందరిని హింసించి చంపారు అలనాటి రజాకార్లు. ఇక నిజాం, రజాకార్ల పాలనలో తెలంగాణ ప్రజలు చితికిపోతున్నారు. ఇక వారి అరాచకలను తిప్పికొట్టాలని తెలంగాణ ప్రజలు ఏకం అయ్యారు. తిరుగుబాటే శరణ్యమన్నారు తెలంగాణ ప్రజలు. ‘పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప’ అనే మాటతో నిజాం నవాబులు, రజాకార్లపై తిరుగుబాటు మొదలు పెట్టారు. ఇక ఒకవైపు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ వీళ్ళందరూ కూడా తమతమ మార్గాల్లో పోరాటాలు చేస్తుంటే.. నిజాం వీళ్ళను అణిచివేసింది. ఇక వరంగల్ జిల్లాలోని బైరన్ పల్లి లో నిజాం కు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలకగా, ఉవ్వెత్తున పోరాటం మొదలయ్యింది. ఇక ఈ పోరాటంలో నిజాం పాలకులు 100 మంది తెలంగాణ పోరాట యోధులను పొట్టన పెట్టుకున్నారు. ఇక అదేరోజు కుటిగల్ గ్రామంలో పోరాటం చేస్తున్న 40 మందిని చంపారు ఆ రజాకార్లు. ఇక పాలకుర్తి తాలూకా చిట్యాల ఐలమ్మ(చాకలి) దొర తనానికి వ్యతిరేకంగా నడుం బిగించిన మొదటి మహిళగా నిలిచింది. ఇక ఒకవైపు పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య నిజాం పాలనకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించాడు. ఇక అటు పరకాలలో కూడా 13మందిని నిజాం దొరలు బలి తీసుకున్నారు. ఇక తెలంగాణ పోరాటంలో కవులు, కళాకారులూ వాళ్ళ కళతో ప్రజలకు దైర్యం నింపారు. ‘బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే పోతావ్ కొడుకో నైజాము సర్కరోడా..’ అంటూ పాటలతో ఉద్యమాన్ని మరింత ఊపు తెప్పించారు అప్పటి కళాకారులు. ఇక ఈ పోరాటంలో ప్రాణాలు పోయిన మొదటి వ్యక్తిగా దొడ్డి కొమురయ్య నిలిచాడు. ఇక సెప్టెంబర్ 13, 1948 న బికారయుద్ధం జరిగింది. ఇక ఈ యుద్ధం అపరేషన్ పోలో పేరిట సాగిన ఓ సైనిక చర్య. ఇక ఈ చర్య తరువాత నిజాం లొంగిపోతున్నట్లు ప్రకటన చేసాడు. ఇక ఆ తరువాత తెలంగాణను భారత్ లో విలీనం చేయడానికి అంగీకారం లభించింది. ఇక అప్పటి నుండి తెలంగాణ భారత్ లో కలిసి అసలైన స్వాతంత్ర్యాన్ని తెచ్చుకుంది. ఇక దొరల దోపిడీ పాలనకు స్వస్తి పలికి, తెలంగాణ గడ్డ దొరల రాజ్యం నుండి విముక్తి పొందిన కారణంగా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇక తెలంగాణ దొరల విముక్తి నుండి బయట పడి 72 వసంతాలు పూర్తి చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here