వేర్ ఈస్ కెసిఆర్ కి తెరపడింది

Advertisement

తెలంగాణ లో గత కొంత కాలం అందరి నోటా వినపడ్డ మాట సోషల్ మీడియా లో పోస్ట్ అయిన పోస్ట్ లు చాలా వరకు కూడా వేర్ ఈస్ కెసిఆర్ అనే…అయితే వీటన్నిటికీ ఈ రోజుతో తెర పడింది. దాదాపుగా 13 రోజుల విరామం తరువాత తన అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్ కి చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్. అయితే ఈ రెండు వారాల కాలాన్ని తాను ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో గడిపినట్లు తెలుస్తుంది.

ఈ విధంగా గత కొంత కాలంగా కెసిఆర్ ఎవ్వరి ముందుకి రాకపోవడం తో తెలంగాణ ప్రజల్లో వివిధ రాకాలైన అనుమానాలు తలెత్తడం జరిగింది . కొంత మంది అయితే ఏకంగా కెసిఆర్ కి కరోనా రావడం తో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు అంటూ ప్రచారం కూడా చేసేశారు. అయితే వాటిల్లో ఎటువంటి వాస్తవం లేదు అని TRS అధికారులు తెలిపినప్పటికీ ఈ ప్రచారం మాత్రం ఆగకుండా కొనసాగింది. వాటాన్నిటికి చెక్ పెట్టె విధంగా ఈ రోజు కెసిఆర్ గారు ప్రగతి భావం చేరుకున్నారు.

కెసిఆర్ గతం లో రైతులకు త్వరలోనే ఒక శుభవార్త తెలుపుతానంటూ ప్రకటించడం జరిగింది. అయితే ఆలా ప్రకటించిన తరువాత కెసిఆర్ మరల ఆ విషయం గురించి మాట్లాడకపోవడం ఆ తరువాత కొంత కాలానికే ఇలా కనుమరుగవ్వడం జరిగింది .ఇప్పుడు ప్రగతి భవన్ చేరుకున్న కెసిఆర్ త్వరలోనే ఫార్మర్స్ తో ఒక వీడియో కాన్ఫరెన్స్ ని ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలో ఉన్నాడంట. అయితే ఈ వీడియో కాల్ లో రైతులకి శుభవార్త చెప్పనున్నాడా లేక అక్కడ చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రానున్నాడా అన్న విషయం పైన ఇంకా స్పష్టత రాలేదు.

కెసిఆర్ మరల ఇలా అందరి ముందుకు రావడం తోనే తన పాత వాగ్దానం గురించి గుర్తుంచుకొని మరి మొదటగా రైతుల తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటానని తెల్పడం తో రైతులు సైతం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం, చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు తో వేర్ ఈస్ కెసిఆర్ అనే పదానికి తెరపడి .. కెసిఆర్ ఈస్ బ్యాక్ అనే కొత్తపదం నెలకొననుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here