సచివాలయం కూల్చివేతకు హై కోర్ట్ బ్రేక్..!

Advertisement

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్ పడింది. కరోనా ను కట్టడి చేయడం లో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయింది అని అంతేకాకుండా సచివాలయం కూల్చి వేసి కొత్తది నిర్మించి తెలంగాణ ప్రభుత్వం నిధుల దుర్వినియోగం చేస్తుందని అటు సోషల్ మీడియా లో మరియు ఇటు ప్రతిపక్ష నాయకులూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కరోనా రోగులకు ప్రభుత్వ హాస్పటల్లో కనీస సౌకర్యాలు లేవని డాక్టర్లు , ప్రతిపక్ష నాయకులూ కూడా ప్రశ్నలు వేస్తున్నారు.

ఇది ఇలా ఉంటె తెలంగాణ ప్రభుత్వం సచివాలయ కూల్చివేత పనులను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. పాత సచివాలయం కూల్చివేసి నాలుగు వందల కోట్లతో కొత్త సచివాలయం నిర్మించాలి అని నిర్ణయించుకుంది. ఈ కూల్చివేతకు వారం రోజుల క్రితం హై కోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు కూల్చి వేత పనులును మొదలు పెట్టారు అధికారులు.

గత నాలుగు రోజుల నుండి సచివాలయ కూల్చివేత పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అరవై శాతం పైగా కూల్చివేత పనులు అయిపోయాయి. ఇది ఇలా ఉంటె తాజాగా హై కోర్ట్ ఈ కూల్చివేత పనులకు బ్రేక్ వేసింది. తాజాగా ఓ సామాజిక కార్యకర్త పీ ఎల్ విశ్వేశ్వర్ రావు హై కోర్ట్ లో పిటిషన్ వేసాడు.

విశ్వేశ్వర్ రావు వేసిన పిటిషన్ లో “ప్రస్తుతం కోవిడ్ నిబంధనలను ఉల్లంగిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారు. ఇలా భవనాలను కూల్చివేయడం వలన వాతావరణం కాలుష్యం అవుతుంది. మున్సిపాలిటీ సాలిడ్ మేనేజిమెంట్ నిబంధనలు పట్టించుకోకుండా కూల్చివేత పనులను చేపడుతున్నారు.” అని ఈ పిటిషన్ లో పేర్కొన్నాడు.

అతని వాదనలు విన్న హై కోర్ట్ కూల్చివేత పనులను నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తుదుపరి ఆదేశాలు వచ్చే వరకు పనులను ముందుకు కొనసాగించొద్దని స్పష్టం చేసింది. మరోపక్క ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం లేదని సచివాలయ అధికారులు అంటున్నారు. మొత్తానికి ఓ సామాన్యుడు వేసిన పిటిషన్ వల్ల తెలంగాణాలో నాలుగు వందల కోట్లు వృధా అవ్వకుండా చేసాడు అని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు నెటిజన్లు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here