MP Raghurama krishna Raju : తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు ‘సిట్’ నోటీసులు.!

NQ Staff - November 24, 2022 / 04:42 PM IST

MP Raghurama krishna Raju : తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు ‘సిట్’ నోటీసులు.!

MP Raghurama krishna Raju : ఇది కదా అసలు సిసలు ట్విస్ట్ అంటే.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి తెలంగాణ ‘సిట్’ నోటీసులు జారీ చేసింది. 41 ఎ – సిఆర్‌పిసి కింద రఘురామకు తెలంగాణ స్పెషల్ సిట్ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచారు రఘురామ. ఆయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. తెలుగుదేశం పార్టీతోనూ అంటకాగుతున్నారు. జనసేన పార్టీ పట్ల కూడా కొంత సానుభూతితో వున్నారు. వాస్తవానికి, తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ ఆయనకు సన్నిహితులున్నారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసుతో రఘురామకి లింకు ఏంటి.?

ఎమ్మెల్యేల కొనుగోలు నిమిత్తం 100 కోట్ల రూపాయల్ని సమకూర్చేందుకు రఘురామ సిద్ధమయ్యారన్నది ఓ పొలిటికల్ గాసిప్. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీ ప్రయత్నించగా, ఆ వ్యవహారంలో ఇద్దరు స్వామీజీలు సహా ఓ బ్రోకర్ పట్టుబడిన సంగతి తెలిసిందే.

ఇదంతా గులాబీ పార్టీ నాటకమని తొలుత బీజేపీ బుకాయించింది.. ఇంకా బుకాయిస్తూనే వుంది. అయితే, ఈ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. పలువురికి నోటీసులు అందిస్తోంది. నోటీసులు అందుకుంటున్నవారిలో బీఎల్ సంతోష్ లాంటి కీలక బీజేపీ నేతలున్నారు. రఘురామకు నోటీసులు వెళ్ళడంతో ఇప్పుడీ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us