Telangana Intention Weekly Tracker Survey Report : మూడోసారి బీఆర్ ఎస్ ప్రభుత్వమే.. తేల్చి చెప్పిన తెలంగాణ ఇంటెన్షన్-వీక్లీ ట్రాకర్ సర్వే..!

NQ Staff - September 17, 2023 / 02:29 PM IST

Telangana Intention Weekly Tracker Survey Report : మూడోసారి బీఆర్ ఎస్ ప్రభుత్వమే.. తేల్చి చెప్పిన తెలంగాణ ఇంటెన్షన్-వీక్లీ ట్రాకర్ సర్వే..!

Telangana Intention Weekly Tracker Survey Report  :

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మరికొన్ని నెల్లలోనే ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థలు, ఇతర సంస్థలు తెలంగాణలో ఎన్నికల సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయం మీద ఇప్పటికే చాలా సర్వేలు చేశాయి కొన్ని సంస్థలు.

అయితే మెజార్టీ సర్వేల్లో బీఆర్ ఎస్ ప్రభుత్వమే గెలుస్తుందని తేలిపోయింది. ఇక తాజాగా తెలంగాణ ఇంటెన్షన్-వీక్లా ట్రాకర్ సర్వే కూడా ఇదే చెప్పింది. ఈ సంస్థ చేసిన సర్వేలో బీఆర్ ఎస్ గెలిచేందుకు 39 శాతం అవకాశం ఉందని తెలిపింది. అలాగే కాంగ్రెస్ గెలిచేందుకు 30.3 శాతం అవకాశం ఉన్నట్టు వివరించింది.

ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న బీజేపీకి ఈ సర్వేలో చుక్కెదురు అయింది. ఎందుకంటే ఆ పార్టీకి కేవలం 9శాతం మాత్రమే అవకాశం ఉందని తేల్చి చెప్పిది ఈ సర్వే. ఇక మరీ ముఖ్యంగా హంగ్ వచ్చే అవకాశలు కూడా ఉన్నాయని 9.2 శాతం ప్రజలు చెప్పారు. ఇది ఒక రకంగా అన్ని పార్టీలకు ఇబ్బంది కలిగించేదే. ఇక చివరకు 12.5 శాతం మంది మాత్రం ఎటూ తేల్చి చెప్పలేకపోయారు.

కానీ ఈ సర్వే కూడా అంతిమంగా బీఆర్ ఎస్ గెలుపునే డిక్లేర్ చేసేసింది. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సర్వే కూడా బీఆర్ ఎస్ గెలుపునే అంతిమంగా చెప్పేసింది. చూడాలి మరి ఈ సర్వే చెప్పినట్టే ఫలితాలు వస్తాయా లేదా వేరే జరుగుతుందా అనేది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us