MP YS Avinash Reddy : అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్.. మంజూరు చేసిన టీఎస్ హైకోర్టు..!
NQ Staff - May 31, 2023 / 11:11 AM IST

MP YS Avinash Reddy : వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాశ్ ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఏర్పడిన నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 27న వాదనలు ముగించిన కోర్టు.. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఒకవేళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినట్టయితే రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ ను జారీ చేసింది.
సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని అవినాష్‌కు షరతు విధించింది కోర్టు. సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది.