Governor Tamilisai : కేసీయార్ సర్కారుని ఏకి పారేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.!

NQ Staff - September 8, 2022 / 07:28 PM IST

157304Governor Tamilisai : కేసీయార్ సర్కారుని ఏకి పారేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.!

Governor Tamilisai : తెలంగాణ గవనర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత కొంతకాలంగా తెలంగాణలో కేసీయార్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోన్న విషయం విదితమే. గవర్నర్ ప్రోటోకాల్ విషయమై కేసీయార్ సర్కార్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడాన్ని తమిళిసై తప్పు పడుతున్నారు.

Telangana Governor Tamilisai criticizes KCR Govt

Telangana Governor Tamilisai criticizes KCR Govt

మేడారం జాతరకు వెళ్ళినప్పుడు కావొచ్చు, మరో సందర్భంలో కావొచ్చు.. గవర్నర్‌కి ప్రోటోకాల్ ప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలను కల్పించడంలేదు.. తగిన గౌరవం కూడా ఇవ్వడంలేదు అధికారులు. ప్రభుత్వ పెద్దలకు తలొగ్గి, అధికారులు గవర్నర్ కార్యాలయానికి సహకరించడంలేదన్న విమర్శలున్నాయి.

తాజాగా మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా గవర్నర్ తమిళిసై.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కేసీయార్ ప్రభుత్వం మీద. రిపబ్లిక్ డే వేడుకల దగ్గర్నుంచి, మేడారం జాతర వరకు.. తనకు ఎక్కడా తగిన గౌరవం ప్రభుత్వం ఇవ్వడంలేదని ఆరోపించారు తమిళిసై.

మహిళను కాబట్టే అవమానిస్తున్నారా.?

ఎట్ హోం కార్యక్రమానికి వస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీయార్ రాలేదని ఆక్షేపించారు తమిళిసై. ‘నన్ను కాదు, నేను కూర్చున్న కుర్చీకి గౌరవం ఇవ్వాలి. గవర్నర్ పదవికే గౌరవం ఇవ్వలేకపోతే.. ప్రజలను మీరెలా బాగా చూసుకుంటారు.?’ అని ప్రశ్నించారు తమిళి సై.

ఓ పెద్దాసుపత్రికి డైరెక్టర్‌గా వున్న ప్రముఖ వైద్యుడు, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్స చేయించుకుంటున్నాడంటే, తెలంగాణలో సర్కారీ వైద్యమెలా వుందో అర్థమవుతోందని తమిళిసై ఎద్దేవా చేశారు.

‘మీరు నీ విషయంలో ఎలాగైనా వ్యవహరించండి.. నాకు సౌకర్యాలు కల్పించకపోయినా, మర్యాద ఇవ్వకపోయినా.. నేను ప్రజల కోసం పని చేస్తాను.. రాజ్‌భవన్‌ని అంటరాని ప్రాంతంగా మీరు చూసినాసరే, ప్రజలు మాత్రం తమ సమస్యలు చెప్పుకునేందుకు నా దగ్గరకు వస్తారు.. వాటి పరిష్కారం కోసం నా పరిధిలో పని చేస్తా.. ఓ మహిళ పట్ల ఇంత చిన్న చూపు మీకు తగదు..’ అంటూ తమిళి సై ఉద్వేగంగా కేసీయార్ మీద మండిపడ్డారు.