మాట నిలబెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం

Advertisement

హైదరాబాద్: కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతున్న తరుణంలో ప్రజలు హాస్పిటల్స్ ను డేవాలయలుగా, డాక్టర్స్ ను దేవుళ్లుగా చూస్తున్నారు. అయితే కొంతమంది డాక్టర్స్ ఈ విపత్కర పరిస్థితిని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీని పై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే ఈ మాటలు హామీల వరకే పరిమితం అవుతాయని, ఆచరణలో సాధ్యం కావాని చాలామంది అనుకున్నారు. అయితే హామీ ఇచ్చిన కొన్ని గంటలకే సోమాజిగూడలోని డెక్కన్ హాస్పిటల్ లో కరోనా చికిత్స చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయకుండా ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో, హాస్పిటల్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డెక్కన్ హాస్పిటల్ పై వచ్చిన ఫిర్యాదులు నిజమని రుజువు కావడంతో హాస్పిటల్ లో కరోనా చికిత్స చేయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

డెక్కన్ హాస్పిటల్ యాజమాన్యం ఒక కరోనా బాధితుడి నుండి 14 రోజుల చికిత్సకు రూ.17.5 లక్షల బిల్లు వేశారు. కానీ అతను మృతి చెందారు. అప్పటికే కుటుంబ సభ్యులు రూ. 8 లక్షలు చెల్లించారు. మిగితా డబ్బులు చెల్లిస్తేనే డెడ్ బాడీని ఇస్తామడంతో కుటుంబ సభ్యులు మీడియా ముందు వచ్చారు. ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. అలాగే ఒక కరోనా నిర్దారణ కాకముందే రూ. 3 లక్షల బిల్ వేశారు. దీనితో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ప్రభుత్వం విచారణ చేసి, హాస్పిటల్ లో కరోనా చికిత్స చేయరాదని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here