తెలంగాణాలో LRS రుసుము తగ్గింపు

Advertisement

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ పై విమర్శలు వస్తున్నాయి. అయితే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు అనే తేడా లేకుండా ఎల్ఆర్ఎస్‌ స్కీమ్ వర్తింపజేసింది. ఇక ఈ స్కీమ్ గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి అసలు ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసిన దానికంటే ఎల్ఆర్ఎస్‌కే ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు సర్కార్ కాస్త ఊరట కల్పించింది.

ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు 131 జీవోను సవరించి, రేపే జీవోను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల పట్ల గౌరవం ఉన్నది కాబట్టే 131 జీవోను సవరిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక గతంలో ఎప్పుడైతే వారు రిజిస్ర్టేషన్ చేసుకున్నారో, వాటి విలువ ఆధారంగానే సవరించిన జీవోను గురువారం రోజున విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here