పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Advertisement

హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా రాష్ట్రంలో 12 లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎగుమతులు, అంతరాష్ట్ర రవాణా ఇబ్బందుల మధ్యే జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఈ లాజిస్టిక్ పార్కులను నిర్మించనున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని మంగళ పల్లిలో హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ, అంకాన్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన లాజిస్టిక్ పార్కును నిర్మించగా, ఆ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే రంగారెడ్డిలోని బాటసింగారంలో, మేడ్చెల్, సంగా రెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నల్గొండ లాంటి జిల్లాలో ఈ లాజిస్టిక్ పార్కులను నిర్మించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. రైల్వే స్టేషన్, విమానాశ్రమాల దగ్గర పార్కుల నిర్మాణానికి స్థలాలూ కేటాయించడాన్ని ప్రభుతం ప్రయత్నాలు చేస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here