తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Admin - August 20, 2020 / 10:54 AM IST

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. దాదాపు గత ఆరు నెలలుగా విద్యాసంస్థలన్ని కూడా మూతపడ్డాయి. దీనితో విద్యాసంస్థలు, విద్యార్థులు అందరు కూడా తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పటికే కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అయితే సర్కార్ పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది.

ఇందులో భాగంగా ప్రభుత్వం అన్ని సర్కార్ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఉన్న సర్కార్ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఇక అనంతరం దశల వారీగా ఇతర జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us