Telangana Government: కొత్త స్కీం ప్ర‌వేశ పెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. కుటుంబానికి ఐదు నాటు కోళ్లు

Telangana Government: తెలంగాణ ప్ర‌భుత్వం స‌రికొత్త స్కీమ్‌ల‌ని ప్ర‌వేశ పెడుతూ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఎన్నో కొత్త ప‌థ‌కాల‌ని ప్ర‌వేశ పెడుతూ వ‌స్తున్న తెలంగాన ప్ర‌భుత్వం గ్రామాల్లోని పేదలకు నాటు కోళ్లు అందించే కొత్త స్కీం కు నాంది పలకాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఏకంగా 163 కోట్లు ఖర్చు పెట్టనుంది సర్కార్.

Telangana Government Introducing a new Scheme to Provide 5 Hens per House
Telangana Government Introducing a new Scheme to Provide 5 Hens per House

58 లక్షల కుటుంబాలు లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు యోచిస్తోంది. నాటు కోళ్ల పెంపకంతో పేదలకు ఆదాయం సమకూర్చడం తో పాటు రూరల్ ఏరియా లో… న్యూట్రీషియన్ లోపాన్ని అధిగమించవచ్చు అని అంచనా వేస్తోంది ప్రభుత్వo.

163 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రెండు కోట్ల నాటు కోళ్లను పంపిణీ చేయడానికి తెలంగాణ పశు సంవర్ధక శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ కోళ్ళతో బేటా 85 కోట్ల గుడ్లు 8.5 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుందని లెక్కలు వేసింది. గుడ్ల ఉత్పత్తి తో వేగంగా 350 కోట్లు అలాగే… కోళ్ల అమ్మకాలతో 290 కోట్లు మొత్తం 630 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు వేస్తోంది.

అలానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సర్కారు దవాఖానాలను ఆధునీకరిస్తోంది. టెస్ట్‌ల కోసం డయాగ్నస్టిక్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. మ‌రో వైపు వివిధ ప‌థ‌కాలు కూడా ప్ర‌వేశ పెడుతుంది.