కోవిడ్ ల్యాబ్ మేనేజ్మెంట్ సిస్టంను ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

Advertisement

హైదరాబాద్: కరోనా పరీక్షల ఫలితాలను బాధితలకు తెలియజేయడంతో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ల్యాబ్ మేనేజ్మెంట్ సిస్టంను అన్ని టెస్టింగ్ ల్యాబ్స్ లలో ప్రవేశపెట్టింది. దీని వలన కరోనా పరీక్షల ఫలితాల సమాచారం నేరుగా బాధితుల మొబైల్ కు వస్తుంది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల కారణంగా కరోనా పరీక్షల ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరిగేది. ఈ ఆలస్యాన్ని అధిగమించడానికి యాంటీజెన్ పరీక్షలు చేయడం ప్రారంభించిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ ఫలితాల వివరాలను కూడా మొబైల్ కు పంపించనున్నారు. యాంటీజేన్ పరీక్షల్లో నెగటివ్ వచ్చినా కూడా కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కోవిడ్ ల్యాబ్ మేనేజ్మెంట్ సిస్టం వల్ల కరోనా పాజిటివ్ వచ్చిన వారిని చేర్చుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అధికారులకు అనువుగా ఉంటుంది. అలాగే తప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వడాన్ని కూడా అరికట్టవచ్చు, మరియు ప్రభుత్వం దగ్గర కూడా రోగుల యొక్క పూర్తి సమాచారం ఉంటుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here