ఎల్ఆర్ఎస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్

Advertisement

తెలంగాణ సర్కార్ ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటించింది. అయితే ఆగస్టు 28వ తేదీ వరకు సెల్ డెడ్ ఉన్న వారికే అని ప్రకటిస్తూ ఎల్ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ప్రకటించింది. అయితే టీఎస్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తింపు చేయనున్నారు.అలాగే అక్టోబర్‌ 15వ తేదీ లోగా ఆన్ ‌లైన్ ‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తును‌ నింపాలని తెలంగాణ సర్కార్ సూచించింది.

ఇక ఎల్‌ఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు 1000 రూపాయలు. అలాగే లే అవుట్‌ దరఖాస్తు‌ ఫీజు 10వేల రూపాయలు. రెగ్యులరైజేషన్‌ ఫీజులు 100 గజాల లోపు ప్లాట్లకు గజానికి 200 రూపాయలు ఉంటుందని అలాగే 100 గజాల నుంచి 300 గజాల వరకు గజానికి 400 రూపాయలు ఉంటుందని తెలిపారు. అలాగే రెగ్యులరైజేషన్‌ ఫీజు 300 గజాల నుంచి 600 వరకు గజానికి 600 రూపాయల రెగ్యులరైజేషన్‌ చార్జీ ఉండనుందని తెలంగాణ సర్కార్ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here