కరోనా పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Admin - July 26, 2020 / 03:48 PM IST
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రోజుకు వెయ్యి కేసుల పైగా నమోదవుతన్నాయి. ఇలా పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు రాష్ట్ర రాజధాని అయినా హైదరాబాద్ లో కేసుల తీవ్రత అత్యధికంగా పెరుగుతున్నాయి.
ఇక ఇలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే ఒక్క కోవిడ్ హాస్పటల్ గా సేవలు అందిస్తుంది సికింద్రాబాద్ లోని ఉన్న గాంధీ దవాఖాన. ఈ హాస్పటల్ లో కరోనా కు సంబందించిన చికిత్సలు అన్ని కూడా ఇక్కడే జరుగుతున్నాయి.
అయితే ఈ హాస్పటల్ తో పాటు మరో రెండు ప్రభుత్వ కోవిడ్ దవాఖానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. అయితే తొందరగా ఏర్పాటు చేయాలనీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి అధికారులందరికీ ఆదేశాలు కూడా జారీ చేసింది.
తెలంగాణ సర్కార్ నియమిస్తున్న రెండు ఆసుపత్రుల్లో ఒకటి ఫీవర్ ఆసుపత్రి మరొకటి కింగ్ కోటి ఆసుపత్రి. ఈ రెండు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా పూర్తీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఇక ఈ ఆసుపత్రుల వివరాల్లోకి వెళితే ఫీవర్ ఆసుపత్రిలో మొత్తం 340 పడకలు కలిగి ఉన్నాయి. దాంట్లో 190 పడకలు కరోనా రోగుల కోసం ఏర్పాటు చేయగా, మరో 100 పడకలుగా ఐసీయూ లో ఉపయోగించనున్నారు.
అలాగే కింగ్ కోటి ఆసుపత్రిలో మొత్తం 350 పడకలు ఉండగా, దాంట్లో 200 ల పడకలు కరోనా రోగుల కోసం ఏర్పాటు చేయగా, మిగితా 200 ల పడకలు ఐసీయూ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.