తెలంగాణలో కరోనాతో 16 మంది వైద్యులు మృతి

Advertisement

తెలంగాణాలో కరోనా శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు మరియు చికిత్సల గురించి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి వివరించారు. ఇక ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ కరోనా కు చికిత్స అందిస్తున్నాము అని అన్నాడు. అలాగే ఈ వైరస్ కి సంబందించిన యాంటీ వైరల్ డ్రగ్స్ ను అన్ని జిల్లాల ఆసుపత్రులకు పంపిస్తున్నాం అని తెలిపాడు.

అలాగే ఇతర చికిత్స కోసం వచ్చిన వారికి కూడా ట్రీట్మెంట్ అందజేయాల్సిన అవసరం ఉందని సూచించాడు. అయితే కరోనా బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు అని పేర్కొన్నాడు. అందుకోసమే వైద్య సిబ్బంది బాగోగుల పై మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపాడు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడగా.. దాంట్లో 16 మంది మృతి చెందారు. అందుకే వైద్య సిబ్బంది జాగ్రత్తగా ఉండాలి అని రమేష్ రెడ్డి వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here