Telangana Elections Live Updates : తెలంగాణ ఎన్నికల లైవ్ అప్ డేట్స్..!

NQ Staff - December 3, 2023 / 04:30 PM IST

Telangana Elections Live Updates : తెలంగాణ ఎన్నికల లైవ్ అప్ డేట్స్..!

గజ్వేల్ లో కేసీఆర్ విజయం సాధించారు.. ఈటల రాజేందర్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు.

 

సిద్దిపేటలో హరీవ్ రావు విజయం సాధించారు.

 

సిరిసిల్లలో కేటీఆర్ విజయం సాధించారు. కేకే మహేందర్ రెడ్డిపై 22693 ఓట్లతో విజయం సాధించారు

 

గోషామహల్ లో రాజాసింగ్ విజయం సాధించారు

 

నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 53 వేల 412 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

 

చార్మినార్ లో MIM విజయం సాధించింది..

 

అంబర్ పేటలో BRS విజయం సాధించింది.

 

నిజమాబాద్ అర్బన్ లో బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా విజయం సాధించారు

 

నిజమాబాద్ అర్బన్ లో బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా విజయం సాధించారు

 

వేముల వాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపు

 

జుక్కల్ లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావు గెలుపు

 

షాద్ నగర్ లో 9వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వీర్ల శంకర్ గెలుపు

 

ఆంధోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహా గెలుపు

 

భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ 21వేల ఓట్లతో గెలుపు

 

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి 42 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు

 

రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ గెలుపు

 

తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి గెలుపు

 

నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి గెలుపు

 

పరిగిలో కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గెలుపు

 

మిర్యాల గూడలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గెలుపు

 

నిజమాబాద్ రూరల్ లో 21వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

 

బాన్సువాడలో 23582 ఓట్లతో పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు

 

నాగార్జున సాగర్ లో కుందూరు జయవీర్ రెడ్డి విజయం సాధించారు

 

మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి 32వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

 

చెన్నూరులో వివేక్ వెంకటస్వామి విజయం సాధించారు

 

కొడంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం సాధించారు.. 32800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

 

మెదక్ లో బీఆర్ ఎస్ భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రోహిత్ రావు విషయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు

 

బీజేపీకి షాక్ తగిలింది.. దుబ్బాకలో రఘునందన్ రావు ఓడిపోయారు. బీఆర్ ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.

 

బీఆర్ఎస్ ఖాతాలో తొలి సీటు పడింది. భద్రాచలంలో ఆ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ విజయం సాధించారు.

 

కరీంనగర్ లో బీఆర్ ఎస్ ఆధిక్యం.. 13 రౌండ్లు ముగిసేసరికి 4978 ఓట్ల లీడ్ లో గంగుల కమలాకర్ ఉన్నారు

 

సిరిసిల్లలో 12వ రౌండ్ మూసే సమయానికి బిఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ 25997 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

 

10 రౌండ్లు ముగిసేసరికి పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు 25338 ఓట్లతో ముందంజలో ఉన్నారు

 

అటు ఛార్మినార్ లో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ విజయం సాధించారు.

 

కాంగ్రెస్ ఇప్పటి వరకు మూడు స్థానాల్లో విజయం సాధించింది.. రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం సాధించారు. ఇప్పటికే అశ్వారావుపేట (ఆదినారాయణ), ఇల్లెందు(కోరం కనకయ్య) ల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

 

కరీనంగర్ లో గంగుల కమలాకర్ 6330 ఓట్లతో లీడింగ్ లో కొనసాగుతున్నారు

 

సిరిసిల్లలో పదో రౌండ్ ముగిసేసరికి కేటీఆర్ 17305 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు

 

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మొదలైన సంబురాలు.. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ అంజనీ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ

 

ఐదుగురు మంత్రులే ముందంజ.. కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి మాత్రమే ముందంజలో ఉన్నారు. మిగతా మంత్రులు మొత్తం వెనకంజలో ఉన్నారు

 

హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో ఉత్తమ్ భార్య పద్మావతి లీడ్ లో కొనసాగుతున్నారు

 

కొడంగల్ లో 12 రౌండ్లు పూర్తి… ఇప్పటి వరకు 18వేల ఓట్ల లీడింగ్ లో రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు

 

నల్గొండలో ఒకే ఒక్క స్థానంలో బీఆర్ ఎస్ ఆధిక్యంలో ఉంది. సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నారు

 

సిర్పూర్ లో ఉత్కంఠ.. ఇప్పటి వరకు బీఆర్ ఎస్, బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పుడు నాలుగో రౌండ్ ముగిసే సమయానికి బీఎస్పీ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్‌ కుమార్ స్వల్ప ఓట్లతో ముందంజలోకి వచ్చారు

 

ఐదు రౌండ్లు ముగిసే సరికి సిర్పూర్ లో ఆర్ ఎస్ ప్రవీణ్‌ కుమార్ నాలుగో స్థానానికి పడిపోయారు.

 

ఐదు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ మొత్తం 67 స్థానాలు లీడ్ లో కొనసాగుతోంది.. బీఆర్ ఎస్ పార్టీ 35 స్థానాలు లీడ్ లో ఉంది. బీజేపీ ఇప్పటి వరకు ఎనిమిది స్థానాల్లో లీడ్ లో ఉంది. ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో లీడ్ లో కనిపిస్తున్నారు

 

కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్నారావు ముందంజలో ఉన్నారు. బర్రెలక్క వెనకబడి ఉన్నారు

 

మధిర నుంచి భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు.

 

మల్కాజగిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి ముందంజలో ఉన్నారు

 

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి అజాజుద్దీన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు

 

ఆదిలాబాద్, సిర్పూర్, ముథోల్, ఆర్మూర్, బహదూర్ పురా, కార్వాన్, యాకుత్ పురా, గోషామహల్, కరీంనగర్ లో బీజేపీ లీడ్ లో ఉంది.

 

తొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్ లో ఉంది. అందులో ఓల్డ్ సిటీలోనే మూడు స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది

 

బోణీ కొట్టిన కాంగ్రెస్.. అశ్వారావు పేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం

 

సిరిసిల్లలో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి 13173 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ ముందంజ

 

నిర్మల్ లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు

 

నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి 3851 ఓట్లతో ముందంజలో ఉన్నారు

 

 

5997ఓట్లతో కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.

 

ఎల్బీనగర్ లో 7053ఓట్లతో బీఆర్ ఎస్ పార్టీ లీడ్ లో కొనసాగుతోంది

 

కొడంగల్ లో 10351 లీడ్ లో రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు.. సెకండ్ ప్లేస్ లో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు

 

కల్వకుర్తి 4412 ఓట్లతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ముందంజలో ఉన్నారు

 

ఇబ్రహీం పట్నంలో 9501 ఓట్లతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది..

 

కామారెడ్డిలో 10886 ఓట్లతో లీడ్ లో రేవంత్ రెడ్డి.. సెకండ్ ప్లేస్ కు కేసీఆర్.. థర్డ్ ప్లేస్ కు విజయరమణారెడ్డి

 

గజ్వేల్ లో కేసీఆర్ కు 8464 ఓట్లతో కేసీఆర్ ముందంజ, రెండో స్థానంలో ఈటల రాజేందర్..

 

ఆర్మూర్ లో ఆరు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ముందజలో ఉన్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వెనకబడ్డారు

 

ముథోల్ లో బీజేపీ అభ్యర్థి రామారావు ముందంజలో ఉన్నారు

 

సిరిసిల్లలో 6 రౌండ్లు ముగిసేసరికి కేటీఆర్ 7524 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

 

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద తుమ్మల నాగేశ్వర్ రావు 5701 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

 

చెన్నూరులో బాల్క సుమన్ మీద 17375 ఓట్ల ఆధిక్యంలో వివేక్ ఉన్నారు..

 

కామారెడ్డిలో కేసీఆర్ పై 1100 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు..

 

సంగారెడ్డిలో జగ్గారెడ్డిపై చింత ప్రభాకర్ 407 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

 

70 దాటిన కాంగ్రెస్.. తెలంగాణలో ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తి కాగా కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది

 

కోరుట్లలో ధర్మపురి అరవింద్ వెనకంజలో ఉన్నారు. ఆయన రెండో స్థానంలో కొనసాగుతున్నారు

 

దుబ్బాకలో వెనకబడిన రఘునందన్ రావు.. రెండో స్థానంలో కొనసాగుతున్నారు..

 

కరీంనగర్ లో ఐదో రౌండ్ ముగిసేసరికి బండి సంజయ్ స్వల్ప మెజార్టీకి వచ్చారు

 

పోటీ చేసిన రెండో చోట్ల ఈటల రాజేందర్ వెనకంజ.. గజ్వేల్ లో రెండో స్థానంలో ఉన్న ఈటల రాజేందర్.. హుజురాబాద్ లో మాత్రం మూడో స్థానానికి పడిపోయారు

 

మంథనిలో ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి 10504 ఓట్ల ఆధిక్యంతో శ్రీధర్ బాబు ముందంజలో ఉన్నారు

 

మానకొండూర్ లో 5వ రౌండ్లలో 2454 లీట్ల కాంగ్రెస్ లీడ్ లో ఉంది

 

నల్లగొండలో 9 రౌండ్స్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కోమటి వెంకటరెడ్డి 25,200 ఓట్ల ఆధిక్యం

 

మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థిపై స్వల్ప మెజార్టీతో ఉన్న సబిత ఇంద్రారెడ్డి

 

వేములవాడలో ఐదు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 2841 ఓట్లతో ముందంజ

 

ముగ్గురు మంత్రుల ముందంజ.. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి ముందంజలో ఉన్నారు

 

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెనకంజలో ఉన్నారు

 

పరకాలలో మూడు రౌండ్లు ముగిసేసరికి బీఆర్ ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు

 

సిరిసిల్లలో ఐదు రౌండ్లు ముగిసేసరికి కేటీఆర్ 5329 ఓట్లతో ముందంజలో ఉన్నారు

 

రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ ఆధిక్యంలో ఉన్నారు

 

కామారెడ్డిలో నాలుగు రౌండ్లు ముగిసేసరికి మూడో స్థానానికి సీఎం కేసీఆర్ పడిపోయారు.. మొదటి నుంచి ఆయన మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

 

మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు మీద బీఆర్ ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి 2252 ఓట్ల లీడ్ లో ఉన్నారు

 

హుజురాబాద్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మూడు రౌండ్లు ముగిసేసరికి 3313 ఓట్ల లీడ్ లో ఉన్నారు.. రెండో స్థానంలో ఈటల రాజేందర్ ఉన్నారు

 

మధిరలో నాలుగు రౌండ్లు ముగిసేసరికి భట్టి విక్రమార్క లీడ్ లో కొనసాగుతున్నారు

 

దేవరకొండలో మూడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది

 

వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి వెనకంజలో ఉన్నారు

 

మూడు రౌండ్లు ముగిసేసరికి జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు

 

ములుగులో మూడు రౌండ్లు ముగిసేసరికి సీతక్క ముందంజలో ఉంది

 

సిద్దిపేటలో హరీశ్ రావు ఆధిక్యంలో ఉన్నారు.

 

గజ్వేల్ లో మూడు రౌండ్లు ముగిసేసరికి కేసీఆర్ ముందంజలో ఉన్నారు

 

ముథోల్, తాండూరులో బీఆర్ ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది

 

కామారెడ్డి, కొడంగల్ లో నాలుగు రౌండ్లు ముగిసేసరికి రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు

 

నల్గొండ జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్.. అన్ని నియోజకవర్గాల్లో మూడు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది

 

మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వెనకంజలో ఉన్నారు

 

ఛతీసుగఢ్ లో 90 నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ బీజేపీ 47 సీట్ల లీడ్ లో కొనసాగుతోంది.. కాంగ్రెస్ 40 సీట్ల లీడ్ లో ఉంది..

 

మధ్యప్రదేశ్ లో 230 సీట్లు ఉండగా.. బీజేపీ 132 సీట్ల లీడ్ లో కొనసాగుతోంది.. కాంగ్రెస్ 97 సీట్ లో కొనసాగుతోంది.. ఇతరులు 4 సీట్లలో లీడ్ లో ఉన్నారు.

 

రాజస్థాన్ లో 199 నియోజకవర్గాలకు బీజేపీ 107 నియోజకవర్గాల్లో లీడ్ లో ఉంది.. కాంగ్రెస్ 83 సీట్లు లీడ్ లో ఉంది..

 

తెలంగాణలో కాంగ్రెస్ 66 సీట్ల మెజార్టీలో కొనసాగుతోంది. బీఆర్ ఎస్ పార్టీ బీర్ ఎస్ 40 సీట్లు మెజార్టీలో కొనసాగుతోంది.. బీజేపీ 6 సీట్ల మెజార్టీలో కొనసాగుతోంది.. ఎంఐఎం 4 చోట్ల లీడ్ లో ఉంది.. ఇతరులు 1 సీట్ లో లీడ్ లో ఉన్నారు..

 

మానకొండూరులో మూడు రౌండ్లు ముగిసే సరికి బీఆర్ ఎస్ ముందంజలో ఉంది

 

రెండవ రౌండ్ ముగిసేసరికి సిరిసిల్లలో 1759’ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్

 

హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ముందజలో ఉన్నారు

 

కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని ఆధిక్యంలో కొనసాగుతున్నారు

 

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు

 

 

మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు

 

బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి 5వేల ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు

 

భూపాలపల్లిలో గండ్ర సత్యానారాయణ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు

 

ఆదిలాబాద్ లో బీజేపీ ముందంజలో ఉన్నారు

 

ఖానాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు

 

వేముల వాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారు

 

ధర్మపురిలో మొదటి రెండు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌ లీడ్ లో ఉన్నారు

 

పరకాలలో బీఆర్ ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు

 

స్టేషన్ ఘన్ పూర్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ముందంజలో ఉన్నారు

 

ఖైరతాబాద్ లో బీఆర్ ఎస్ పార్టీ లీడ్ లో కొనసాగుతోంది

 

దుబ్బాకలో బీఆర్ఎస్ టిఆర్ఎస్ లీడ్ 3650 ఓట్లతో లీడ్ లో కొనసాగుతోంది. రఘునందన్ రావు రెండో స్థానంలో ఉన్నారు

 

గోషామహల్ 2nd రౌండ్ ముగిసేసరికి బిజెపి 2800 ఓట్లతో లీడ్ లో ఉంది

 

హుజరాబాద్ లో ఈటెల రాజేందర్ కు షాక్.. కౌశిక్ రెడ్డి 1061 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

 

కొడంగల్ లో 1365 ఓట్లతో రేవంత్ ముందంజ

 

ఎల్బీనగర్ లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుధీర్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు

 

శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీ ముందంజలో ఉన్నారు

 

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2000 ఓట్లతో ముందంజలో ఉన్నారు

 

పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2230 ఓట్లతో ముందంజలో ఉన్నారు

 

అంబర్ పేటలో బీఆర్ ఎస్ ముందంజలో ఉంది

 

బోథ్ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ పార్టీ ముందంజలో ఉంది

 

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ (60) సీట్లను క్రాస్ చేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్-61, బీఆర్ఎస్-29, బీజేపీ-3, ఇతరులు-7 స్థానాల్లో అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ప్రస్తుత ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు

 

రెండు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి లీడ్.. కామారెడ్డి లో 1981 ఓట్లతో, కొడంగల్ లో 2513 ఓట్లతో లీడ్ లో ఉన్నారు

 

పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు 2410 ఓట్లతో ముందంజలో వున్నారు

 

చార్మినార్ లో బీజేపీ అభ్యర్ధి తొలి రౌండ్ లో 2539 ఓట్ల ఆధిక్యం.. వెనుకంజ లో ఎంఐఎం పార్టీ

 

కొల్లాపూర్ లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు 1300 ఓట్ల ఆధిక్యం

 

కామారెడ్డి లో మొదటి, రెండు రౌండ్లలో రేవంత్ రెడ్డి 1981 ఓట్లతో లీడ్ లో ఉన్నారు

 

ములుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కంపు లో
మొదటి రౌండ్ లో సీతక్క కాంగ్రెస్ లీడ్

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీఆర్ఎస్ 5 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, మజ్లిస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

 

కామారెడ్డిలో వెయ్యి ఓట్లతో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి కొనసాగుతున్నారు

 

ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ మొదటి రౌండ్ లో లీడ్ లో ఉంది

 

ఉమ్మడి నల్గొండ జిల్లా లో మొదటి రౌండ్ పన్నెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్ లీడ్

 

ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొదటి రౌండ్లో కాంగ్రెస్పై పై బిజెపి అభ్యర్థి పాయల శంకర్ 8వందల ఓట్ల ఆదిక్యం..

 

నకిరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం 2408 ఓట్లతో లీడ్ లో ఉన్నారు

 

తుంగతుర్తి లో కాంగ్రెస్ అభ్యర్ధి మందుల సామేల్ ముందంజా…

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లో బీఆర్ ఎస్ ముందు వరుసలో ఉంది.

 

కామారెడ్డిలో తొలి రౌండ్ లో రేవంత్ రెడ్డి ముందంజ

 

పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న యశస్విని రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.

 

మంత్రి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్న స్థానంలో వెనక బడ్డారు. ఆయన మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు

 

కొల్లాపూర్ లో పోస్టల్ బ్యాలెట్ లలో బర్రెలక్క ముందంజ

 

సిరిసిల్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కేటీఆర్ ముందంజలో ఉన్నారు..

 

సిరిసిల్లలో కేటీఆర్ తో పాటు కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణి రుద్రమ పోటీలో ఉన్నారు

 

కొడంగల్ లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.

 

కరీంనగర్ లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బండి సంజయ్ ముందంజ..

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us