తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా పార్థసారథి

Advertisement

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పార్థసారథి నియామకం అయ్యారు. ఇక రిటైర్డ్ ఐఏఎస్‌ పార్థసారథి ని నియమిస్తూన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ కూడా ఆమోదం పలికారు. అయితే గతంలో వ్యవసాయ ముఖ్య కార్యదర్శిగా పార్థసారథి పనిచేశారు. ఇక ఆ పదవిలో పార్థసారథి ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.

అయితే కమిషనర్‌గా ఉన్న నాగిరెడ్డి ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. అయితే స్వతంత్ర అధికారం గల ఈ పదవిలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లేక విరమణ పొందిన అధికారులను కమిషనర్‌గా నియమించవలసి ఉంటుంది. ఇక పార్థసారథి 1993 సంవత్సర ఐఏఎస్‌ బ్యాచ్‌ కు చెందిన వారు. పార్థసారథి ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి స్థాయిలో పని చేసి రిటైర్మెంట్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here