Telangana : తెలంగాణలో ‘సత్తా’ చాటేది హస్తమేనా? తాజా అంచనాలతో ఫుల్ జోష్

NQ Staff - November 21, 2023 / 09:44 PM IST

Telangana : తెలంగాణలో ‘సత్తా’ చాటేది హస్తమేనా? తాజా అంచనాలతో ఫుల్ జోష్

Telangana  :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు రణరంగాన్ని తలపిస్తోంది. అధికార బీఆర్ఎస్ హాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతుండగా.. ఆ పార్టీని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులను ఉపయోగిస్తోంది. దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెపుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఉందని.. బీజేపీ మూడో స్థానంలో సింగిల్ డిజిట్ కే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనా వైఫల్యం, కేసీఆర్ వ్యవహార శైలి, అవినీతి కుటుంబ పాలన, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న తీరు.. తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ విశ్వసిస్తోంది.

హోరాహోరీ పోరు ఉన్నా కాంగ్రెస్ కే సానుకూల వాతావరణం ఉన్నట్టు ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారు. అదే నిర్ణయాన్ని సెఫాలజిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల టైంలో గెలుపు అంచనాలతో బెట్టింగ్ లు నిర్వహించే ‘సత్తా మార్కెట్’ తెలంగాణలో తమ అంచనాలను బయటపెట్టిందంటూ ప్రముఖ సెఫాలజిస్టు పార్థాదాస్ ఇంట్రెస్టింగ్ అంశాలను వెల్లడించారు.

ఈ విషయాలపై పార్థాదాస్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. అందులో ‘సత్తా మార్కెట్’ తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది వెల్లడించిందని తెలిపారు. కాంగ్రెస్ 55-57 సీట్లు, బీఆర్ఎస్ 53-55 సీట్లు సాధించే అవకాశం ఉందని పేర్కొన్నట్టుగా చెపుతున్నారు. సర్వే ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం ఉండడంతో విజయం ఆ పార్టీనే వరించనుందని అంటున్నారు. అయితే ఆ కాంగ్రెస్ నేతలు తమకు 70 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వ వ్యతిరేకత, తమ ఆరు గ్యారెంటీలు తమనే గెలిపిస్తాయని నమ్ముతున్నారు. దీనికి తోడు అన్నీ సర్వేలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని, తమకు తిరుగులేదని ఉత్సాహంగా ఉన్నారు. అయితే మోదీ, అమిత్ షాలు తరుచూ తెలంగాణ భారీ బహిరంగ సభలు పెట్టినా కూడా ఆ పార్టీకి 4-5 సీట్లు వస్తాయని ‘సత్తా మార్కెట్’ సర్వే చెప్పడం గమనార్హం.

Telangana Conducted Survey Of Satta Market

Telangana Conducted Survey Of Satta Market

సర్వేల అనుకూల ఫలితాలతో కాంగ్రెస్ తమ ప్రచారంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. రాహుల్, ప్రియాంక ఇద్దరూ బహిరంగ సభల్లో ఫుల్ జోష్ తో పాల్గొంటున్నారు. తెలంగాణలో తమదే విజయమని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. కాళేశ్వరం అవినీతి, గ్రూప్ పరీక్షల లీకేజీలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ధరణి పేరుతో అవినీతి.. ఇలా బీఆర్ఎస్ పథకాలతో నష్టపోయిన వర్గాలు తమకు అండగా ఉంటాయని భావిస్తున్నారు.

కేసీఆర్ ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదని.. కుటుంబ పాలన, అవినీతి..ఇవన్నీ తమ గెలపునకు సహకరిస్తాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రజలు ఇక బీఆర్ఎస్ ను మూడోసారి భరించలేమనే నిర్ణయానికి వచ్చినట్టు చెపుతున్నారు. మూడున్నర కోట్ల జనాభాలో కీలకమైన యువత ఓట్లు 90శాతం తమకే పడుతాయని, వాటికి తోడుగా లక్షల్లో ఉన్న వారి
కుటుంబాల ఓట్లు తమకు మెజార్టీని కట్టబెడుతాయని, ఇక అధికారం లాంఛనమే అని ఖుషీ అవుతున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us