Etela Rajender : మంత్రి ఈటలను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారా?

Etela Rajender : తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇటీవల చాలా మీటింగుల్లో ఆయన రాజకీయాలపై చూపించిన ఆక్రోశం మామూలుది కాదు. రాజకీయాలు మారిపోయాయని… రాజకీయ నాయకులను కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అలాగే… సంక్షేమ పథకాల విషయంలో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం చేసిందే. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారని… ఆయన్ను త్వరలోనే కేబినేట్ నుంచి తప్పిస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ.. అవన్నీ ఉట్టి పుకార్లుగానే తేలిపోయాయి. ఇప్పుడు మరోసారి ఈటల రాజేందర్ గురించి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.

telangana cm kcr is serious on minister etela rajender
telangana cm kcr is serious on minister etela rajender

మంత్రి ఈటల రాజేందర్ మరో పార్టీకి సహకరిస్తున్నారు… అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈటలను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారు అనే ప్రచారం మరోసారి జోరందుకుంది. అంతే కాదు… ఇటీవల మంత్రి కేటీఆర్ స్వయంగా… ఈటలను తీసుకెళ్లి సీఎం కేసీఆర్ తో మాట్లాడించారు. ఇద్దరూ కలిసి కాసేపు భేటీ అయ్యారు కూడా. వాళ్లిద్దరి మధ్య ఏ చర్చ జరిగిందనేది తెలియనప్పటికీ… త్వరలో మంత్రి వర్గ విస్తరణలో భాగంగా… మంత్రి ఈటలతో పాటు మరో మంత్రిని కూడా తప్పించి.. వేరే వాళ్లకు చాన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా… భూకబ్జా అంటూ.. మీడియాలో ఈటల రాజేందర్ గురించి కథనాలు కూడా వస్తున్నాయి. తన పౌల్ట్రీ ఫాం కోసం ఈటల రాజేందర్ 100 ఎకరాలు కబ్జా చేశారంటూ మీడియాలో కథనాలు వస్తుండటంతో సీఎం కేసీఆర్ మంత్రి ఈటలను టార్గెట్ చేశారని.. అందుకు మీడియాలో ప్రస్తుతం ఈటలకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని… త్వరలోనే మంత్రి ఈటల పదవి పోవడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. అలాగే… ఆక్సిజన్ సిలిండర్ల విషయంలోనూ మంత్రి ఈటల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగా చర్చనీయాంశం అయ్యాయి.

Advertisement