పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే: తెలంగాణ ప్రభుత్వం

Advertisement

హైదరాబాద్: బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నూతనంగా స్థాపించబోయే పరిశ్రమల్లో 80% సెమి స్కిల్స్ ఉద్యోగాలు, 60% స్కిల్ల్డ్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే నూతన పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎప్పటి నుండో పెండింగులో ఉన్న ఈ పాలసీ ఇప్పుడు రూపు దిద్దుకుంది. ఈ నూతన జాబ్ పాలసీ ప్రకారం పరిశ్రమలను రెండు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ-1 ప్రకారం పరిశ్రమల్లో 70% సెమి స్కిల్స్ ఉద్యోగాలు, 50% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. అలాగే కేటగిరీ-2 ప్రకారం పరిశ్రమల్లో 80% సెమీ స్కిల్ల్డ్ ఉద్యోగాలు, 60% స్కిల్ల్డ్ ఉద్యోగాలు ఇవ్వాలని పాలసీలో పేర్కొన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే పాలసీనీ గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఈ పాలసీతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్ వాడకాన్ని పెంచడానికి తెలంగాణ ఎలెక్ట్రానిక్ వెహికల్ మరియు ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని కూడా ప్రవేశపెట్టింది. ఈ పాలసీ వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే సంస్థలకు రాయితీలు కలిపించనున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here