కరోనా బారిన పడి డీఎస్పీ శశిధర్ మృతి.

Advertisement

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు దారుణంగా విస్తరిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం లో ఎనభై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒకవైపు ఈ మహమ్మారి విస్తరణను ప్రభుత్వం అడ్డుకట్టు వేస్తున్న వైరస్ వ్యాప్తిని నివారించ లేకపోతోంది. ఇప్పటికే సాధారణ ప్రజలతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చాలా మంది కరోనా బారిన పడ్డారు.

ముఖ్యంగా కరోనా నివారణకు ముఖ్య పాత్ర పోషిస్తున్న పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శశిధర్ కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆయనకు ఇది వరకే ఇతర వైద్య సమస్యలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇక డిఎస్పీ శశిధర్ మృతి పై జిల్లా పోలీస్ అధికారులు తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేసారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here