Telangana Announced Two Days Of School Holidays Wake Of Rains : బ్రేకింగ్.. స్కూళ్లకు రెండు రోజులు సెలవులు.. వర్షాలే కారణం..!
NQ Staff - July 20, 2023 / 09:37 AM IST

Telangana Announced Two Days Of School Holidays Wake Of Rains :
తెలంగాణ ప్రభుత్వం వర్షాల నేపథ్యంలో అలర్ట్ అయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా స్కూల్ పిల్లలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ఇవాళ, రేపు సెలవు దినాలుగా గుర్తించింది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఇప్పటికే స్కూళ్లకు చేరుకున్న విద్యార్థులు తిరిగి ఇండ్లకు చేరుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కాలనీలు నీట మునిగాయి.
దాంతో పిల్లలు స్కూళ్లకు వెళ్లడం చాలా ఇబ్బందిగా తయారవుతోంది. వర్షాల కారణంగా జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తిరిగి ఎల్లుండి స్కూళ్లు స్టార్ట్ కానున్నాయి.