తెలంగాణలో మరో ఎమ్మెల్యే కు కరోనా

Advertisement

కరోనా తెలంగాణ లో శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇలా చాలా మంది కూడా కరోనా బారిన పడి చాలా వరకు కోలుకున్నారు. దాంట్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే తాజాగా తెరాస ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీనితో తన కుటుంబ సబ్యులకు మరియు ఇంట్లో పని వారికీ కూడా కరోనా టెస్టులు చేయించగా అతని భార్య, ఇద్దరు కొడుకులు మరియు వంటమనిషికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ల సలహాల మేరకు తన కుటుంబ సభ్యులందరు కూడా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

తెలంగాణ లో ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ , ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కరోనా బారిన పడి కోలుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here