Tejaswi Madivada Marriage Update : పెళ్లి చేసుకోబోతున్న తేజస్వి మదివాడ.. పెళ్లి కొడుకు బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే..!
NQ Staff - July 2, 2023 / 09:28 AM IST

Tejaswi Madivada Marriage Update :
ఈ నడుమ టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తమ మనసుకు నచ్చిన వారిని పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. రీసెంట్ గానే శర్వానంద్ పెండ్లి చేసుకున్నాటు. అటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.
మరికొద్ది నెలల్లో వీరి పెండ్లి ఉండబోతోంది. ఈ క్రమంలోనే మరో యంగ్ బ్యూటీకూడా పెండ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతోంది. ఆమె ఎవరో కాదు తేజస్వి మదివాడ. ఆమె గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా బోల్డ్ పాత్రల్లో నటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మరింత ఫేమస్అ యింది.
అతనితో డేటింగ్..
ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి ఆఫర్లు లేవు. దాంతో తేజస్వి మదివాడ పెండ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. తన చిరకాల మిత్రుడితో ఆమె కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ ఈ నడుమ ఔటింగ్ కు కూడా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వీరి మ్యాటర్ ను ఇంట్లో వారికి చెప్పి ఒప్పించిందంట.

Tejaswi Madivada Marriage Update
వారు కూడా ఒప్పుకోవడంతో త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక పెండ్లి కొడుకు బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. హైదరాబాద్ లో వారికి కొన్ని కాంప్లెక్స్ లు ఉన్నాయంట. త్వరలోనే రెస్టారెంట్ బిజినెస్ కూడా పెడుతున్నారని తెలుస్తోంది. అంటే తేజస్వి బడా ఇంటికి కోడలు కాబోతుందన్నమాట.