అందాల వల వేస్తోంది.. తేజస్వీ ఫోటోలు వైరల్
NQ Staff - November 25, 2020 / 01:47 PM IST

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ కమిట్‌మెంట్ టీజర్ రిలీజ్ సందర్భంగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా టైటిల్ కమిట్‌మెంట్ అని ఉంది కదా అని తన గతం గురించి, ఇండస్ట్రీలో జరిగే వాటి గురించి బోల్డ్‌గా చెప్పేసింది. ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలను ఎలా చూస్తారో పచ్చి పచ్చిగా మాట్లాడేసింది. కమిట్‌మెంట్ సినిమా తన లైఫ్ స్టోరీయే అని, ప్రతీ అమ్మాయి జీవితంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయని పెద్ద ఉపన్యాసమే ఇచ్చింది. ఆ స్పీచ్‌లు కాసేపు పక్కన పెడితే తేజస్వీ హాట్ హాట్ ఫోటోలతో చేసిన రచ్చ వేరే లెవెల్‌లో ఉంది.
కమిట్‌మెంట్ టీజర్ ఈవెంట్‌కు వచ్చిన తేజస్వీ అందాల విందు చేసింది. అక్కడి కెమెరాలకు బాగానే పని చెప్పింది. వెరైటీ వెరైటీ పోజులు పెట్టి అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం తేజస్వీ ఎద అందాలు సోషల్ మీడియాలో నెటిజన్లకు మతి పోగుడుతున్నాయి. మామూలుగానే తేజస్వీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. లాక్డౌన్‌లో తేజస్వీ అందాల ఆరబోత ఓ లెవెల్‌లో జరిగింది. అయితే ఈ కమిట్‌మెంట్ సినిమా కోసం తేజస్వీ బాగానే కష్టపడినట్టుంది.
సినిమాల మీద విసుగొచ్చి ఇక మానేద్దామనుకున్న సమయంలో ఈ కథ విన్నానని ఎంతో గొప్పగా చెప్పింది తేజస్వీ. మొత్తానికి కమిట్‌మెంట్ అని టైటిల్ పెట్టి హాట్ పోస్టర్లు, బోల్డ్ డైలాగ్‌లతో టీజర్‌ను రిలీజ్ చేసి బాగానే క్లిక్ అయ్యారు. మధ్య మధ్యలో తేజస్వీ ఇలా తన అందాలను ప్రదర్శిస్తుండటం కమిట్‌మెంట్‌కు బాగా ప్లస్ అయ్యేలానే ఉంది. ఈ చిత్రం విడుదల అయ్యాక ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అయితే థియేటర్ రిలీజా? ఓటీటీనా? అని నిర్ణయించుకోలేదట.