Team India : అనుకున్నట్లుగానే క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా
NQ Staff - January 24, 2023 / 10:38 PM IST

Team India : న్యూజీలాండ్ తో జరిగిన మూడవ వన్డే లో కూడా భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ 3-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుని అద్భుతమైన రికార్డులను నమోదు చేయడం జరిగింది.
మూడవ వన్డే లో ఏకంగా 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 385 పరుగులు చేయడం జరిగింది. ఓపెనర్లు రోహిత్ మరియు గిల్ లు సెంచరీలు చేయడంతో భారీ స్కోర్ ను భారత్ సాధించింది.
న్యూజీలాండ్ భారీ లక్ష్య సాధనలో భాగంగా 41.2 ఓవర్లలో 295 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ కాన్వే 138 పరుగులు చేసి విజయం దిశగా జట్టును తీసుకు వెళ్లాడు. ఆయన ఔట్ అయిన తర్వాత వచ్చిన వారు సరిగా నిలవక పోవడంతో 295 కి ఆలౌట్ అయ్యారు.
కులదీప్ 3 వికెట్లు, శార్దూల్ 3 వికెట్లు, చాహల్ 2 వికెట్లు, హార్ధిక్, ఉమ్రాన్ లు ఒక్కో వికెట్ చొప్పున తీసి న్యూజీలాండ్ ఓటమి పాలవ్వడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ఇండియా నెం.1 స్థానంను మళ్లీ సొంతం చేసుకుంది.