Team India : అద్భుతాలేం జరగలేదు.! బంగ్లాపై టీమిండియా గెలిచేసింది.!

NQ Staff - December 18, 2022 / 04:20 PM IST

Team India : అద్భుతాలేం జరగలేదు.! బంగ్లాపై టీమిండియా గెలిచేసింది.!

Team India : టీమిండియా మీద బంగ్లాదేశ్ జట్టు విజయం సాధిస్తే అది గొప్ప విషయం.! బంగ్లాదేశ్ మీద టీమిండియా గెలవడం అనేది సాధారణమైన విషయమే. వన్డే మ్యాచ్‌లలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండింటిని కోల్పోయింది టీమిండియా. కానీ, మూడో మ్యాచ్‌లో గెలిచింది.

టెస్ట్ సిరీస్ సందర్భంగా టీమిండియా ఏం చేస్తుందోనని టీమిండియా అభిమానులూ ఒకింత ఉత్కంఠకు లోనయ్యారు. 513 పరుగుల విజయలక్ష్యం బంగ్లా జట్టు ముందుంది. ఏమో, అద్భుతం సృష్టించేస్తుందేమో బంగ్లా జట్టు అనుకున్నారంతా.

అద్భుతానికి ఆస్కారం లేకుండా పోయిందాయె..

లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు 324 పరుగులకు ఆలౌటవడంతో విజయం టీమిండియాని వరించింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 404 పరుగులు చేయగా, బంగ్లా జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

విజయానికి 518 పరుగులు చేయాల్సిన బంగ్లా జట్టు 324 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 6 వికెట్లకు 272 పరుగులతో ఈ రోజు ఆట ప్రారంభించిన బంగ్లా స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యింది.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us