Virat Kohli : టీ20 వరల్డ్ కప్ : కోహ్లీ కి గాయం, కీలక మ్యాచ్ కి ఉంటాడా? లేదా?
NQ Staff - November 9, 2022 / 12:31 PM IST

Virat Kohli : టీ20 వరల్డ్ కప్ 2022లో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ టీం ఇండియా కు ఘన విజయాలను సాధించి పెట్టిన విరాట్ కోహ్లీ బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా అక్షర పటేల్ వేసిన బాల్ కి గాయపడ్డట్లుగా సమాచారం అందుతుంది.
రేపు ఇంగ్లాండుతో అత్యంత కీలకమైన సెమీస్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ గాయపడడం ఇండియా క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. విరాట్ కోహ్లీ గజ్జల్లో బాల్ బలంగా తగిలిందని దాంతో కొన్ని నిమిషాల పాటు కుప్ప కూలిపోయాడు అంటూ జాతీయం మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకు టీం మేనేజ్మెంట్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు, నిన్న మొన్నటి వరకు రోహిత్ శర్మ మ్యాచ్ లో ఉంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అతడు గాయం కారణంగా రేపటి మ్యాచ్ ఆడడేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ నేటి మీడియా సమావేశంలో రోహిత్ శర్మ తను ఫిట్ గా ఉన్నానని రేపటి మ్యాచ్ కి అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఇంతలోనే విరాట్ కోహ్లీ కి గాయం అవ్వడంతో రేపటికి మ్యాచ్ లో ఉంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.