Team India: ఇంగ్లండ్ ఫ్లైటెక్కిన మెన్స్, ఉమెన్స్ టీమ్స్.. వైర‌ల్‌గా మారిన విరాట్ కూతురి ఫొటోలు

Team India: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాల‌ను ఛిన్నాభిన్నం చేసిన విష‌యం తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి చేయ‌బ‌ట్టి సినిమాలు, స్పోర్ట్స్, ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌కు ఆటంకం ఏర్ప‌డింది. గ‌త ఏడాది ఇదే ప‌రిస్థితులు త‌లెత్త‌గా దుబాయ్‌లో ప‌లు జాగ్ర‌త్త‌ల న‌డుమ ఐపీఎల్ నిర్వ‌హించారు క్రికెట్ నిర్వాహ‌కులు. ఆటగాళ్లంద‌రిని బ‌యోబబుల్ వాతావ‌ర‌ణంలో ఉంచి టోర్నీ మొత్తం స‌జావుగా జ‌రిగేలా చేశారు.ఇక ఈ ఏడాది కూడా అలానే ప్ర‌య‌త్నించిన టీమ్‌లో ఎక్కువ మంది ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డుతున్న నేప‌థ్యంలో వాయిదా వేశారు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ దుబాయ్‌లో మిగ‌తా టోర్నీని కొన‌సాగిస్తామ‌ని బీసీసీఐ పేర్కొంది.

Team India

మ‌రి కొద్ది రోజుల‌లో ఇంగ్లండ్ టోర్నీతో పాటు వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ కూడా జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇండియ‌న్ మెన్స్‌, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఇంగ్లండ్‌కు బ‌య‌లుదేరాయి. మెన్స్, ఉమెన్స్ టీమ్స్ రెండు వారాలుగా ముంబైలోని ఓ హోట‌ల్‌లో క్వారంటైన్‌లో ఉంటూ వెళ్లేప్పుడు కూడా ఒకే చార్ట‌ర్డ్ ఫ్లైట్ ఎక్కారు. మెన్స్ కెప్టెన్ కోహ్లి, వుమెన్స్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్‌తోపాటు స్టార్ క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్, ఝుల‌న్ గోస్వామి త‌దిత‌రులు ఈ ఫ్లైట్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీ త‌న స‌తీమ‌ణి అనుష్క‌శ‌ర్మ‌తో పాటు కూతురు వామిక‌ను కూడా త‌న వెంట తీసుకెళ్లాడు. ఎయిర్ పోర్ట్‌లో కోహ్లీ ఫ్యామిలీని కెమెరాలో బంధించగా ఆ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Team India

మెన్స్ టీమ్ న్యూజిలాండ్‌తో వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌తోపాటు ఇంగ్లండ్ టీమ్‌తో ఐదు టెస్టులు ఆడ‌నుంది. అటు వుమెన్స్ టీమ్ ఒక టెస్టు, మూడు వ‌న్డేలు, మూడు టీ20ల్లో ఇంగ్లండ్ టీమ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. జూన్ 18న డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. ట్రోఫీతో ఇండియాకు తిరిగి రావాల‌ని మెన్స్, ఉమెన్స్ టీమ్స్ భావిస్తున్నాయి. వుమెన్స్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఫ్లైట్ ఎక్కే ముందు మీడియాతో మాట్లాడ‌గా, మెన్స్ టీంతో మేం ఉండడం వ‌ల‌న యూకేలో ఎలా ఆడాలో వారిని అడిగి తెలుసుకుంటాం. స‌మ‌యం దొరికినప్పుడ‌ల్లా వారి ద‌గ్గర నుండి స‌ల‌హాలు తీసుకుంటాం అని స్ప‌ష్టం చేసింది.

Team India