Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ ఉవాచ.! నాణేనికి రెండు వైపులుంటాయ్.!

NQ Staff - November 11, 2022 / 04:38 PM IST

Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ ఉవాచ.! నాణేనికి రెండు వైపులుంటాయ్.!

Sachin Tendulkar : క్రికెట్ జస్ట్ ఓ ఆట మాత్రమే.! కానీ, ఆ క్రికెట్ చుట్టూ కోట్లాదిమంది అభిమానుల ‘అంచనాలు’ ముడిపడి వుంటాయ్. మైదానంలో భారతదేశం తరఫున 11 మంది ఆటగాళ్ళు మాత్రమే బరిలో వుంటాయ్. అదే సమయంలో 140 కోట్ల మంది భారతీయుల ఆశల్ని వాళ్ళు మోయాల్సి వుంటుంది.

ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల విషయంలో, అభిమానుల అంచనాలే.. ఆటగాళ్ళపై విపరీతమైన ఒత్తిడిని పెంచేస్తాయ్. ఇది ఆ ఆటగాళ్ళకీ తెలుసు. అయినాగానీ, అంతిమంగా క్రికెట్ అంటే అది జస్ట్ ఓ ఆట మాత్రమే.

ఓటమి, గెలుపు..

రెండూ ఒకేలా తీసుకోవాలంటున్న సచిన్ టెండూల్కర్  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కంటే బాగా క్రికెట్‌ని ఇంకెవరు అర్థం చేసుకోగలరు.? అభిమానుల అంచనాలు, దేశ ప్రతిష్ట.. వీటన్నింటి గురించీ క్రికెట్ పరంగా సచిన్‌కి వున్నంత అవగాహన ఇంకెవరికీ వుండదు.

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీస్ దశలో ఇంటికి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి క్రికెట్ అభిమానుల నుంచి. అయితే, నాణానికి రెండు వైపులున్నట్టే.. ఆట అన్నాక గెలుపోటములు వుంటాయనీ.. అదే జీవిత పరమార్థమనీ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.

సక్సెస్ మనదని చెప్పుకుంటాం.. ఫెయిల్యూర్ కూడా స్వీకరించగలగాలి.. అంటూ సచిన్ ట్వీటేశాడు. ‘ఔను, సచిన్ చెప్పింది నిజమే..’ అని అప్పటిదాకా టీమిండియాని విమర్శించినవారు కూడా సచిన్ మాటలతో ఏకీభవిస్తున్నారు.

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us