Chetan Sharma : ఆటగాళ్లు ఫిట్ నెస్ ఇంజెక్షన్లు వేసుకుంటారు.. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కామెంట్లు..!
NQ Staff - February 15, 2023 / 10:46 AM IST

Chetan Sharma : టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఇండియన్ క్రికెటర్లపై వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆటగాళ్ల ఫిట్ నెస్ విషయంలో ఆయన ఇలాంటి కామెంట్లు చేశాడని ఓ ఛానెల్ సీక్రెట్ సర్వేలో బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆయన ప్రైవేట్ సంభాషణలో మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. చాలామంది ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ గా ఉండరు.
80శాతం ఫిట్ నెస్ గా ఉన్న వారు 100శాతం ఫిట్ నెస్ కోసం ఇంజెక్షన్లు చేయించుకుంటారు. అప్పట్లో బుమ్రా కూడా పూర్తి స్థాయి ఫిట్ నెస్ లో లేడు. ఇంజెక్షన్ వేయించుకుని ఫిట్ నెస్ సాధించాడు. అలాగే చాలామంది క్రికెటర్లు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. క్రికెట్ టీమ్ లో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి కోహ్లీ వర్గం అయితే ఇంకోటి రోహిత్ శర్మ వర్గం.
కెప్టెన్సీ విషయంలో..
వీరిద్దరి మధ్య ఇగోల కారణంగా విభేదాలు తలెత్తాయి. కానీ ఇద్దరూ ఒక్కటిగానే ఆడుతుంటారు. రోహిత్, హార్థిక్ పాండ్యా ఇద్దరూ నాకు అత్యంత సన్నిహితులు. నా ఇంటికి హార్థిక్ చాలా సార్లు వచ్చాడు. కెప్టెన్సీ విషయంలో ఆయన నాతో చాలాసార్లు చర్చించాడు అంటూ మాట్లాడాడు చేతన్ శర్మ.
అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. చేతన్ శర్మ మీద వేటు తప్పేలా లేదని కొందరు అంటున్నారు. ఎందుకంటే గతేడాది కాలంగా తన సెలక్షన్ విషయంలో ఎన్నోసార్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు చేతన్ శర్మ. కానీ బీసీసీఐ ఆయన విషయంలో తటపటాయిస్తోంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసేలా ఉన్నాయని చాలామంది అంటున్నారు.