Viral News : 15 ఏండ్ల స్టూడెంట్ తో పారిపోయిన మహిళా టీచర్.. హైదరాబాద్ లో కలకలం..!
NQ Staff - March 4, 2023 / 12:20 PM IST

Viral News : ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాలామంది అంటుంటారు. కానీ ఈ నడుమ కొన్ని ప్రేమ వ్యవహారాలు చూస్తుంటే.. నిజంగానే అసహ్యం వేసేలా ఉంటున్నాయి. చదువు చెప్పి విద్యార్థుల భవిష్యత్ ను తీర్చి దిద్దాల్సిన టీచర్లు దారి తప్పుతున్నారు. తమ స్టూడెంట్లతోనే ప్రేమలో పడి చివరకు వారి జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చందానగర్ లో ఓ అమ్మాయి(26) ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది. అదే స్కూల్ లో గచ్చిబౌలికి చెందిన ఓ స్టూడెంట్ (15) టెన్త్ చదువుతున్నాడు. కాగా ఫిబ్రవరిలో ఆ మహిళా టీచర్ కనిపించకుండా పోయింది. దాంతో ఆమె తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రెండు రోజుల తర్వాత..
రెండు రోజుల తర్వాత తిరిగి రావడంతో ఆయన కంప్లయింట్ వెనక్కు తీసుకున్నాడు. ఇక అదే రెండు రోజులు సదరు విద్యార్థి కూడా కనిపించుకుండా పోవడంతో ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు కూడా కేసు పెట్టారు. ఇక రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చిన స్టూడెంట్ ను పోలీసులు విచారించగా తన టీచర్ తో కలిసి వెళ్లినట్టు తెలిపాడు.
దాంతో ఆ మహిళా టీచర్‌ను పోలీసులు విచారించారు. ఇందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తామిద్దరం ప్రేమించుకున్నట్టు తెలిపింది. ఇంట్లో వారు ఆమెకు పెండ్లి సంబంధాలు చూడటంతోనే ఇలా చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది.